నిజామాబాద్

స్పెషల్ పార్టీ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 23: కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణకు విశేషంగా కృషి చేస్తున్న స్పెషల్ పార్టీకి చెందిన 38మంది సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్తికేయ శుక్రవారం ప్రశంసాపత్రాలు బహూకరించారు. ఇటీవలి కాలంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాల సందర్భంగా పకడ్బందీ బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ పరిస్థితులు అదుపు తప్పకుండా చూడడంలో క్రియాశీలక పాత్ర పోషించారని వారిని కొనియాడుతూ ప్రశంసాపత్రాలతో పాటు స్పోర్ట్స్ టీ షర్టులను అందజేశారు. క్రమశిక్షణతో మెలుగుతూ, చక్కగా విధులు నిర్వర్తించే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా సీ.పీ పేర్కొన్నారు. ప్రశంసాపత్రాలు పొందిన వారిలో స్పెషల్ పార్టీకి చెందిన ఆర్‌ఎస్‌ఐ కే.కృష్ణయ్య, కానిస్టేబుళ్లు బీ.చంద్రమోహన్, అశోక్, రమేష్, విజయ్, దశరథ్, రాజవౌళి, రాజు, లక్ష్మణ్, సుధీర్, అనిల్, డీ.శ్రావణ్, నవీన్, శ్రీనివాస్, కృష్ణ, బాలు, అశోక్, బాపురావ్, శ్రీనివాస్, వై.సాయిలు, అనిల్, లాల్‌సింగ్, రంజిత్, పీ.గణేష్, నరేష్‌కుమార్, జీ.మోహన్, సీహెచ్.విజయ్‌బాబు, డీ.లింగం, ఏ.సంతోష్‌కుమార్, హోంగార్డులు లక్ష్మణ్, శ్రీరాంనాయక్, పాపారావు, అమ్జద్, నరుూమ్, శ్రీహరి, జయ్‌రాజ్, రవి, సాయిలు, చిన్నయ్యలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏ.రాంరెడ్డి, ఎన్‌ఐబీ ఏసీపీ జీ.రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, ఆర్.ఐ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
* ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రారంభించిన ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పేట్, పిప్రి, ఆలూర్ గ్రామాల్లో ఆయన ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎర్రజొన్నలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. గతంలో ఎర్రజొన్న రైతులకు ఇచ్చిన హామీ మేరకు జొన్నలను కొనడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని ఆయన చెప్పారు. రైతుల సౌలభ్యం కోసం ప్రాథమిక సహకార సంఘాల్లోనే ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, దీంతో రవాణా చార్జీలు మిగులుతాయని అన్నారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే 24 గంటల కరెంట్ సరఫరా, రుణమాఫీ, పంటల సాగుకు పెట్టుబడి కింద ఎకరానికి 4 వేల చొప్పున ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ కింద మంజూరైన అదనపు గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆరవ వార్డులో మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలోని యాల్ల రాములు మెమోరియల్ హాలులో కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతు నర్సయ్య, జడ్పీటీసీ సభ్యుడు సాందన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇట్టెడి లింగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, పోల మధుకర్, సంజయ్‌సింగ్ బబ్లూ, సుంకరి రంగన్న, పండిత్ ప్రేమ్, నయ్యూం, అజీమ్, ఉస్మాన్ హజ్రమీ, సుమీర్ అహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఏ రామారావు నాయక్, ఏవో గోపి తదితరులు పాల్గొన్నారు.