నిజామాబాద్

పరీక్షల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 23: వార్షిక పరీక్షల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకూడదని, ఎలాంటి భయాందోళనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులపై ఉందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు హితవు పలికారు. ఈ నెల 28వ తేదీ నుండి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం న్యూ అంబేద్కర్ భవన్‌లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలాంటి అపవాదులకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే చర్యలు ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు. వార్షిక పరీక్షలు అంటేనే సహజంగా విద్యార్థుల్లో ఒకింత ఆందోళన నెలకొని ఉంటుందని, ఈ క్రమంలో వారిని తల్లిదండ్రులు కానీ, ఇతర అధ్యాపకులు, పరీక్షా కేంద్రాల నిర్వహకులు ఒత్తిడికి గురి చేస్తే మరింత ఆందోళనకు లోనయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరవుతున్న దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కటి పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ హితవు పలికారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు అనుమతించకూడదని ఇంటర్ బోర్డు నిబంధనలు విధించినందున, విద్యార్థులు నిర్ణీత సమయానికంటే కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 9గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు 8.30గంటల సమయానికే కేంద్రాలకు చేరుకునేలా చూస్తే, వారిలో అనవసర ఆదుర్దాను తగ్గించినట్లవుతుందన్నారు. జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ అవాంతరాలు తలెత్తే అవకాశాలున్నందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను చూసుకోవాలని హితవు పలికారు. టీఎస్‌టీఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే దాని సహాయంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చని సూచించారు. కాగా, పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఇతర అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ఐ.డీ కార్డులు లేని వారిని విధులకు అనుమతించబోమని స్పష్టం చేశారు. సీఎస్, డీఓలకు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లే అనుమతి లేదని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశించారు. కాగా, గతేడాది ఇంటర్మీడియెట్‌లో ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందంజలో నిలుపాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ఆకాంక్షించారు. ఈ ఏడాది జిల్లాలో 39,011మంది బాలబాలికలు ఇంటర్ పరీక్షలు రాయనుండగా, 43పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, కాపీయింగ్‌కు ఆస్కారం కల్పించకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ ఒడ్డెన్నతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు పాల్గొన్నారు.

రైతులతో రాజకీయాలు తగవు
* బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్
బోధన్ రూరల్, ఫిబ్రవరి 23:ప్రతిపక్ష పార్టీలు రైతులతో రాజకీయాలు చేయడం తగదని బోధన్ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్ అన్నారు. శుక్రవారం మండలంలోని సాలూరా, కల్దుర్కి గ్రామాలలలో శనగ కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, రైతును అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. అందులో బాగంగానే రైతులకు రుణమాఫీ, సోయా, కంది, మినుము పంటల కొనుగోళ్లు చేస్తూ వాటికి మద్ధతు ధర కల్పించామన్నారు. శనగ కొనుగోళ్ల కోసం కూడా ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభిస్తున్నామని కానీ ప్రతిపక్ష పార్టీలకు ఇవేవి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల అభివృద్ధి కోసం ఒకవైపు ప్రభుత్వం శతవిధాలా కృషి చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వాటికి స్వస్తి పలికి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, బోధన్ మండలాలలో శనగ పంట ఈ సారి అధికంగా పండిందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ పంటను కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్‌రావ్ పట్వారీ, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేశ్వర్, తహశీల్దార్ గంగాధర్, వ్యవసాయ శాఖ ఏడిఏ కిరణ్మయి, ఏవో వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు సున్నపు గంగామణి, మారయ్య, శివాలయం కమిటీ చైర్మన్ పాలవార్ సాయినాథ్, తెరాస నాయకులు షకీల్, గోపాల్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, కరీం, అనిల్ పటేల్, డిస్కో సాయిలు, పాండు, అంబాదాస్, సంగుమహారాజ్, షాకీర్ పాల్గొన్నారు.

ఆర్మూర్‌లో బందోబస్తు విధులు భేష్
* మొబిలైజేషన్ ముగింపులో సిబ్బందిని అభినందించిన సీపీ

నిజామాబాద్, ఫిబ్రవరి 23: ఆర్మూర్‌లో ఇటీవల రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా సిబ్బంది ఎంతో సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వర్తించారని పోలీస్ కమిషనర్ కార్తికేయ అభినందించారు. ఈ నెల 8వ తేదీ నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సిబ్బందికి నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం శుక్రవారం నాటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీ.పీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్మూర్‌లో రైతులు నిరసనకు దిగిన సమయంలో ఎంతో సంయమనాన్ని పాటిస్తూ, శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కట్టుదిట్టంగా బందోబస్తు విధులు నిర్వర్తించారని అన్నారు. ఇకముందు కూడా ఇదే తరహాలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తూ చక్కటి గుర్తింపు పొందాలన్నారు. విధుల పట్ల సిబ్బంది మరింత అంకితభావం ప్రదర్శించేందుకు మొబిలైజేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పక్షం రోజుల పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజులు, యోగా, స్క్వాడ్ డ్రిల్, ఆయుధాల వినియోగం, సెర్‌మోనియల్ డ్రిల్, ప్లాటూన్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫైరింగ్ ప్రాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్ తదితర అంశాల్లో ఇచ్చిన తర్ఫీదును సద్వినియోగం చేసుకోవాలన్నారు. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించగల్గుతారని సీ.పీ పేర్కొన్నారు. కాగా, సిబ్బందిని వారివారి సామర్థ్యాలకు అనుగుణంగా విధులు కేటాయించాలని తన కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఒకే చోట సుదీర్ఘకాలం పాటు విధుల్లో కొనసాగించకుండా, షిఫ్టు పద్దతిని అవలంభిస్తూ అందరికీ అన్ని విభాగాల్లో పని చేసే అవకాశం కల్పించాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని, సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని సీ.పీ భరోసా కల్పించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని, ఏ ఒక్కరు కూడా ఇందుకు ఆస్కారం కల్పించకుండా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. సిబ్బంది సాదకబాధకాలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రతీ మంగళవారం డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సిబ్బంది తమ సమస్యలు తెలియజేస్తే వారం రోజుల వ్యవధిలోపే వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.
పోలీస్ క్యాంటీన్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, పోలీస్ క్వార్టర్‌లలో ఏవైనా ఇబ్బందులు నెలకొని ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. నలభై సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి సిబ్బందికి హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షలు జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) ఆకుల రాంరెడ్డి, ఎన్‌ఐబీ ఏసీపీ ఎం.రవీందర్, ఆర్‌ఐలు మల్లికార్జున్, జీ.శైలేందర్, బీ.రాంనిరంజన్‌రావు, వీ.శేఖర్, ఏ.ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

రిలయన్స్ పౌండేషన్ కృషి ప్రశంసనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 23: సుస్థిరమైన స్వావలంబన కల్గిన సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రిలయన్స్ పౌండేషన్ దత్తత తీసుకొని పనిచేస్తున్న 20 గ్రామాలను మాడల్ గ్రామాలుగా తీర్చి దిద్దడానికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారయణ అన్నారు. శుక్రవారం జనహిత సమావేశం హల్‌లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, చిన్నపరిశ్రమల సహకారంతో ఆర్థిక అభివృద్ది సాధించడంతో పాటు మానవభివృద్ది కొరకు గ్రామ రైతు సంఘాలు ఉమ్మడిగా వైద్య,విద్యా, తల్లి తండ్రుల సహకారం మీద దృష్టి కేంద్రికరించాలన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ గ్రామాభివృద్ది కొరకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని,ప్రభుత్వ పథకాలు సక్రమంగా వినియోగించుకొని రాష్టన్రికే ఆదర్శంగా ఇంకో20 గంగాదేవి లాంటి గ్రామాలు అవిర్భవించాలని అకాంక్షించారు. రిలయన్స్ పౌండేషన్ ప్రతినిధులు,23 గ్రామాలలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి జిల్లా అధికారులకు వివరించి ఆదర్శ గ్రామాలుగా అవిర్భవించడంలో సహకారం అందించాలన్నారు. 23 గ్రామాలలో 31 వేల హెకార్ల బీడు భూములు అభివృద్ది పరిచామని,992 హెక్టార్స్ భూమికి నీటిపారుదల సదుపాయం కల్పించామని,1200 రియలన్స్ పోషకావనాల ద్వారా పోషకాహర భద్రత కల్పించడం జరుగుతుందన్నారు.23 గ్రామా సంఘాల ఆధ్వర్యంలో త్రాగునీటి సదుపాయం మెరుగుపర్చాలని రిలయన్స్ ప్రతినిధులు వివరించారు.తమ కార్యక్రమాల ద్వారా మొత్తం 5500 కుటుంబాలు లబ్ది పోందుతున్నామని రిలయన్స్ రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్యప్రణాళికాధికారి శ్రీనివాస్,జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, ఉద్యానవన అధికారి శేఖర్,డి ఆర్ డి ఏ ఎపిడి సాయన్న, జిల్లా మహిళా సంక్షేమ అధికారి రాధమ్మ,రిలయన్స్ ప్రతినిధులు రామకృష్ణ,రాజేశ్,బాబురావు,గ్రామ రైతు సంఘాల,కామారెడ్డి అభ్యుదయ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.