నిజామాబాద్

120కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 21: కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే హానికరమైన క్లోరల్ హైడ్రేట్ నిల్వలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 120కిలోల క్లోరల్ హైడ్రేట్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఈ వివరాలను వెల్లడించారు. భీమ్‌గల్ ఎక్సైజ్‌స్టేషన్ పరిధిలోని గోవింద్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంమేరకు తమ సిబ్బం ది ఆకస్మిక దాడులు నిర్వహించారని అన్నారు. కల్లు దుకాణాలలో కల్తీ కల్లును గుర్తించి ధ్వంసం చేశారన్నారు. గోవింద్‌పల్లికి చెందిన రాజేశ్వర్‌గౌడ్ అనే వ్యక్తి క్లోరల్‌హైడ్రేట్ సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో అతని ఇంటిపై దాడి జరుపగా, మూడు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచిన క్లోరల్ హైడ్రేట్‌తోపాటు మరో 30కిలోల మత్తు పదార్థాలు లభ్యమయ్యాయన్నారు. రాజేశ్వర్‌గౌడ్‌ను విచారణ జరుపగా, మోర్తాడ్ మండలం ధర్మోరాకు చెందిన మందా అరుణ్, ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన నవీన్‌గౌడ్‌లతో కలిసి క్లోరల్ హైడ్రేట్ దందా చేస్తున్నట్టు వెల్లడించాడని డేవిడ్ రవికాంత్ తెలిపారు. ఈ మేరకు వారిరువురిని కూడా అదుపులోకి తీసుకున్నామని, క్లోరల్ హైడ్రేట్ రవాణా కోసం వినియోగిస్తున్న మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.

బాల్కొండ రైతులకు కాళేశ్వరం జలాలు
* మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్, మార్చి 21: సాగునీటి విషయంలో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయనే అభిప్రాయంతో బాల్కొం డ రైతులు ఉన్నారని, పనుల వేగాన్ని పెంచి నీటి సమస్యను పరిష్కరించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. బడ్జెట్ సమావేశంలో మాట్లాడేందుకు ఆయనకు అవకాశం రావడంతో ప్రధానంగా నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి కష్టాల గురించి ఎక్కువగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1080కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు నత్తనడకన నడుస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. ఈ పథకం పూర్తయితే నియోజకవర్గంలోని పాత ఎత్తిపోతల పథకాలైన లక్ష్మీ కెనాల్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబ్ లిఫ్టుల పరిధిలో ఆయకట్టుకు సాగునీరందడంతో పాటు అదనంగా మరో 30వేల ఎకరాలకు సాగు సమస్య దూరమవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు. 21వ ప్యాకేజీ పనుల ద్వారా నియోజకవర్గంలోని భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాలకు 80వేల ఎకరాల నూతన ఆయకట్టును స్థిరీకరించి సాగునీటిని అందించవచ్చని అన్నారు. పనుల వేగాన్ని పెంచి రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయాలని ఆయన కోరారు. దీనిపై సంబంధిత మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటన జరిపి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను వేగవంతం చేయిస్తానని, 2018లోపే కాళేశ్వరం జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతామని భరోసా కల్పించారు. అదేవిధంగా 21వ ప్యాకేజీ కింద పైప్‌లైన్ నిర్మాణాలను వేగవంతం చేసి, నూతన ఆయకట్టును కూడా స్థిరీకరిస్తామని హామీ ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గ సాగునీటి కష్టాలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి, మంత్రి ద్వారా సభా సాక్షిగా స్పష్టమైన హామీ పొందడం ద్వారా రైతుల్లో ఆత్మస్థైర్యం నింపినట్లయ్యిందని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి.