నిజామాబాద్

విజయవంతంగా భూప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్: మార్చి 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ సత్తయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లాలో భూప్రక్షాళన దాదాపు పూర్తి అయిందన్నారు. జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. భూముల సర్వేలో రెవెన్యూ సిబ్బంది చాలా కష్టపడ్డారని అభినందించారు. జిల్లాలో 2లక్షల 89 వేల ఖాతాలున్నాయన్నారు. దానిలో నుండి 2లక్షల 75వేల 468ఖాతాలు సరిగా ఉన్నాయన్నారు. ప్రతి రైతు ఖాతాను క్షుణంగా పరిశీలిస్తున్నామని, 2,3 రోజులలో పూర్తిస్థాయిలో భూ ప్రక్షాళన పూర్తి అవుతుందన్నారు. పార్ట్- బిలో ఉన్న ప్రభుత్వ భూములు వివాదాస్పద భూములను పది రోజులలో పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు తహశీల్‌ను ఆర్డీవో శ్రీను సందర్శించి భూ ప్రక్షాళనకు వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ అమీన్‌సింగ్, డిప్యూటి తహశీల్దార్ రంజీత్‌కుమార్ పాల్గొన్నారు.

క్వారీలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
మాక్లూర్, మార్చి 21: అనుమతి లేకుండా బండరాళ్లు పేల్చేందుకు పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో నిజామాబాద్ టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి మాక్లూర్ ఎస్‌ఐ రామానాయుడు బుధవారం మండలంలోని మాదాపూర్‌లో గల కంకర క్వారీపై దాడి చేశారు. క్వారీ యజమాని రాజేశ్వర్ ఎలాంటి అనుమతులు లేకుండా కొద్దిరోజుల నుండి పేలుడు పదార్థాలు వినియోగిస్తూ బండరాళ్లు పేలుస్తున్నాడని ఎస్‌ఐ తెలిపారు. క్వారీలో సోదాలు జరుపగా, 14జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం అయ్యాయని, ఈ మేరకు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ వివరించారు.

డబుల్ బెడ్‌రూంలను సకాలంలో పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి, మార్చి 21: జిల్లాలో డబుల్ బెడ్‌రూం పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణ పంచాయితీరాజ్, నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో దోమకొండ, బీబీపేట్ మండలాల్లో నిర్మాణం అవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో 30ఇండ్లకు, బీబీపేట్ మండలం మందాపూర్, యాడారం గ్రామాల్లో ముప్పై ఇండ్లకు , కామారెడ్డి మండలం నర్సన్నపల్లి యాబై ఇండ్లు పనులు జరుగుతున్న దరిమిలా దరిమిలా పనులు పూర్తిస్థాయిలో నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.