నిజామాబాద్

గల్ఫ్ బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 17: జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తగిన న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ఇటీవల ఓ నకిలీ ఏజెంట్ ఖతార్‌లో మంచి కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలుకుతూ జిల్లాకు చెందిన పలువురు మహిళలను విజిట్ వీసాలపై అక్కడికి పంపించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యు లు ఎవరైనా ఉంటే, వారు తక్షణమే పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కానీ, తమ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాలను పక్కాగా నిర్ధారించుకున్న తరువాతే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని, నకిలీ ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోకూడదని కలెక్టర్ నిరుద్యోగ యువతకు హితవు పలికారు.

రామన్నపేట నీటి కష్టాలు తీరేనా?
మోర్తాడ్, ఏప్రిల్ 17: మండలాల పునర్ వ్యవస్థీకరణలో వేల్పూర్‌లోకి మారిపోయినప్పటికీ, మోర్తాడ్ మండలంలోని పాత రామన్నపేట గ్రామంలో నీటి కష్టాలు తీరడం లేదు. మోర్తాడ్ మండల అధికారులే సమస్యను పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పెద్దవాగులో ఏర్పాటు చేసుకున్న ఫిల్టర్‌బెడ్‌లతో పాటు గ్రామంలోని బోరుబావులు ఎత్తిపోవడంతో పక్షం రోజులుగా రామన్నపేటవాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మంగళవారం కూడా మండల అధికారులు రామన్నపేట గ్రామ పంచాయతీలో నీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయిలో నీరందిస్తున్న వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాన్ని ఆనుకునే ఉన్న వ్యవసాయ బోరుబావిని సర్పంచ్‌తో సహా అధికారుల బృందం పరిశీలించింది. బోరుబావి నిండుగా నీటిని అందిస్తుండటంతో సంబంధిత రైతును అధికారులు ఒప్పించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ బోరుబావి నుండి గ్రామంలోని ట్యాంకులకు నీటిని అందించేందుకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నాలుగు వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మోర్తాడ్ నుం డి సుంకెట్ మీదుగా రామన్నపేట వరకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ ఎక్కడికక్కడ లీక్ అవుతుండటంతో నీరు రామన్నపేటకు చేరడం లేదు. ఏప్రిల్ 2వ వారంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, వచ్చే మే మాసంలో నీటి ఇక్కట్లు ఎలా ఉంటాయో ఊహించుకోవడమే కష్టంగా మారుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.