నిజామాబాద్

2019లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 17: రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లాకృషి చేయాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అన్నారు. మంగళవా రం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నలక్ష్మణ్ అధ్యక్షతన మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశానికి తాహెర్‌బిన్ హందన్ ముఖ్య అతిథిగాహాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను గ్రామ, గ్రామానా ప్రజలకు తెలియజేసి, రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడివలే కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీయే అని అన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విదానాల వల్ల ప్రజలు విసిగి పోయి ఉన్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో, పార్టీతిరిగి పూర్వవైభవం సంతరించుకుని, అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని విమర్శించారు. పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేసేందుకోసం ఈనెల 30లోగా బూత్‌లెవెల్ కమీటీలను పూర్తిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరికి టికెట్ ఇచ్చిన పార్టీ గెలుపుకు సమిష్టిగా కృషి చేసి, నియోజకవర్గంలోకాంగ్రెస్ జెండాను ఏగురవేయడమే ఏకైకలక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు జుమన రాధోడ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని, ఇందుకు ప్రజల నుంచి సాంకేతాలు వస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాల పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. ఈఅవకాశాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సద్వినియోగం చేసుకుని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గకాంగ్రెస్ ఇంచార్జి జాజాల సురేంధర్ మాట్లాడుతూ, పార్టీనీ గ్రామగ్రామాన విస్తరించి, నియోజకవర్గంలోతిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర డెలిగేట్, ఎల్లారెడ్డి మాజీ ఏఎంసి చైర్మైన్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసురావడానికి ప్రతి ఒక్క నాయకులు,కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి, నియోజకవర్గంలోకాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నియోజకవర్గ నేత వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మనసావాచా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ముందుగా కమిటీలను వేసి, గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసి, నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా మండల పార్టీ అధ్యక్షుడు చెన్నలక్ష్మణ్ మాట్లాడుతూ మండలంలోపార్టీ బలోపేతంతోపాటు, కాంగ్రెస్ జెండాఎగురవేసేందుకోసం కృషి చేస్తానని, అన్ని గ్రామాల్లో బూత్‌లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరిని కలుపుకుని సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైల కృష్ణారెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌నాయక్, కాంగ్రెస్ నాయకులు కుడుముల సత్యనారాయణ, షాన్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ పనుల వేగాన్ని పెంచండి
మోర్తాడ్, ఏప్రిల్ 17: మండల కేంద్రమైన మోర్తాడ్‌లో జరుగుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం పనులను భగీరథ ఓఎస్‌డీ సత్యపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రమేష్, ఈఈ నాగేశ్వర్‌రావు తదితరులు మంగళవారం పరిశీలించారు. మార్కెట్ రోడ్డులోనూ, బ్యాంకు రోడ్డులోనూ జరుగుతున్న పైప్‌లైన్ నిర్మాణం పనులను పరిశీలించిన అధికారుల బృందం పనుల వేగాన్ని పెంచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలోని 8మంచినీటి ట్యాంకులకు మిషన్ భగీరథ పైప్‌లైన్ల ద్వారా నీటిని అందిస్తూ ట్రాయల్న్ చేపడుతున్నామని అన్నారు. ప్రస్తుతం ట్రాయల్ రన్ రూపంలో అందిస్తున్న నీటిని వారం రోజుల పాటు ఎవరు కూడా తాగడానికి వినియోగించరాదన్నారు. పక్షం రోజుల పాటు నీటి సరఫరా జరిగితే పైప్‌లైన్లన్నీ శుభ్రమవుతాయని, ఆ తర్వాత నీటి పరీక్షలను జరిపిన తర్వాతే ప్రజలు తాగేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఇంట్రావిలేజ్ పనులు దాదాపు పూర్తి దశలో ఉన్నాయని, 2608గృహాలకు కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1600కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ కింద నూతనంగా నూతనంగా నిర్మించిన ట్యాంకు పనులు కూడా పూర్తయ్యాయని, ప్రస్తుతం మూడు ట్యాంకుల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నామని అన్నారు. పనుల పరిశీలనకు ఈ నెల 20న జిల్లా ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో అధికారుల బృందం పరిశీలన కార్యక్రమం చేపట్టింది. కూలీల సంఖ్యను పెంచాలని, గడువు కంటే ముందే పనులను పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన అధికారుల బృందం, సింహాభాగం పనులను తక్కువ కాలంలోనే పూర్తి చేయడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ సర్పం చ్ దడివె నవీన్‌తో పాటు మండల అధికారులు కూడా పాల్గొన్నారు.