నిజామాబాద్

తుదిదశలో ఆధార్ సీడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 17: రెవెన్యూ దస్త్రాల శుద్ధీకరణలో భాగంగా డిజిటల్ సంతకాల సేకరణ, ఆధార్ సీడింగ్ ప్రక్రియలను వేగవంతంగా చేపట్టి తుది దశకు చేర్చామని కలెక్టర్ ఎం.రాంమోహన్‌రావు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే డిజిటల్ సంతకాల ప్రక్రియ 88 శాతం పూర్తవగా,ఆధార్‌సీడింగ్ 96 శాతం పూర్తయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే. జోషి దృష్టికి తెచ్చారు. మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కలిసి సీఎస్ ఎస్‌కే.జోషి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా, నిజామాబాద్ జిల్లాలో సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు వారికి వివరించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ముందస్తు పెట్టుబడి అందించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకాన్ని జిల్లాలో పారదర్శకంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. తొలి విడతగా 159 గ్రామాల్లో 77,869 మంది రైతులకు 66.27కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో అందించేందుకు అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేశామని, ప్రభు త్వం నుండి ఆదేశాలు అందిన వెంటనే చెక్కుల పంపిణీ చేపడతామని తెలిపారు. సీఎస్ జోషి మాట్లాడుతూ, ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకాల సేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేసి, రైతుబంధు చెక్కుల పంపిణీ జాబితాను సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల చెక్కుల ప్రింటింగ్ కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, త్వరలోనే ఈ చెక్కు లు జిల్లాలకు చేరుకుంటాయని అన్నారు. కాగా, ప్రస్తుత సంవత్సరంలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికలు అందజేయాలని జిల్లా యంత్రాంగాలకు సూచించారు. సకాలం లో మొక్కలు నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా పర్యవేక్షిస్తూ, సిద్ధం చేయించాలన్నారు. నర్సరీలలో ఎక్కువగా ఈత, టేకు మొక్కలను పెంచాలన్నారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు కనీసం వారానికి ఒక రోజైనా ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ వారితో కలిసి అధికారులు మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. హరితహారంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు అందిస్తుందన్నారు. ఇదివరకు సంపూర్ణంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న గ్రామాలకు ఎలాగైనా ఓడీఎఫ్‌గా ప్రకటించారో, అదే తరహాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు బాధ్యతలు చేపట్టిన మీదట హరిత గ్రామాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కాగా, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలలో రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిశోర్ మాట్లాడుతూ, రెవెన్యూ సర్వేలో లేని వక్ఫ్ భూములకు 1బీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు భూములకు హద్దులు రూపొందించి, బోర్డులను ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఎయిడెడ్ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 35కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో చేపట్టే పనులను నిశితంగా పర్యవేక్షణ జరుపుతూ సత్వరమే పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాలకు సొం త భవనాల నిర్మాణాల కోసం స్థలాలను గుర్తిం చి నివేదికలు సమర్పించాలన్నారు. నిజామాబాద్, బోధన్ పట్టణాల్లోని మైనార్టీ గురుకులాలకు పదెకరాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తే, వీటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామ ని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఏ.రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ ప్రసాద్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, జేడీఏ గోవింద్, ఆర్డీఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.