నిజామాబాద్

కాసులకు కక్కుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 17: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అమ లు చేస్తుండడం ఒకింత సత్ఫలితాలు అందిస్తున్నప్పటికీ, ప్రైవేట్ నర్సింగ్ హో ంలలో మాత్రం దోపిడీ పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. సర్కారీ దవాఖానాల పట్ల ఇంకనూ మెజార్టీ ప్రజ ల్లో సదభిప్రాయం నెలకొనలేదనే చెప్పా లి. దీంతో అనేక మంది కాన్పుల కోసం ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా నర్సింగ్ హోంల నిర్వహకులు కాసులకు కక్కుర్తిపడి అవసరం లేకపోయినప్పటికీ లెక్కకుమిక్కిలి సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా వెలసిన ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లలో సుఖ ప్రసవాల కోసం చేరిన వారి లో దాదాపు 70 నుండి 80 శాతం మంది కి ఆపరేషన్లు చేస్తుండడంతో ప్రైవేట్ డాక్టర్ల ధన దాహంపై జిల్లా యంత్రాంగానికి తరుచూ ఫిర్యాదులు అందుతున్నా యి. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాం గం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒకింత చొరవ చూపిస్తున్నప్పటికీ, వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లిప్త వైఖరితో ఎలాంటి ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు ముకుతాడు వేస్తూ, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరిపేందుకు ఆస్కా రం ఉన్నప్పటికీ, ఆ దిశగా నామమాత్రంగానైనా చొరవ చూపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాన్పు కష్టంగా మారిన క్రిటికల్ కేసుల విషయంలోనే ఆపరేషన్లు చేయాలని నిబంధనలు సూచిస్తున్నాయి. సాధారణ కాన్పుల కోసం అసలేమాత్రం ప్రయత్నించకుండానే, మెజార్టీ నర్సింగ్‌హోం ల డాక్టర్లు పెద్దాపరేషన్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భిణీతో పాటు ఆమె కుటుంబీకులను ముందస్తుగానే మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నా రు. కాన్పు జరగడం కష్టంగా ఉందని, కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, ప్రేగు మెడలో వేసుకుందని, గర్భిణీకి రక్తపోటు హెచ్చుతగ్గుల స్థాయిలో ఉందని రకరకాల కారణాలు చెబుతూ, వారంతట వారే సిజేరియన్లకు ముందుకు వచ్చేలా తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇలా అవసరం లేకపోయినప్పటికీ ఆపరేషన్లు నిర్వహించడం వల్ల బాధితులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. కాన్పులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అత్యధికంగా సిజేరియన్ శస్త్ర చికిత్సలు జరుగుతుండడం ప్రైవేట్ నర్సింగ్‌హోం ల ధన దాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 35శాతం వరకే సిజేరియన్లు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం 75 శాతానికి పైగా ఈ తరహా ఆపరేషన్లు జరగడాన్ని బట్టి చూస్తే అవసరం లేని వారికి కూడా సాధారణ కాన్పులకు బదులుగా సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఒక్కో సిజేరియన్ కు అన్ని ఖర్చులు కలుపుకుని బాధిత కుటుంబానికి దాదాపు 30 నుండి 40వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. పుట్టిన శిశువుకు కాస్తంతగా నలత కనిపిస్తే, మ రింత అదనపు బాదుడు తప్పడం లేదు. పైపెచ్చు ఆపరేషన్ల వల్ల మహిళలకు దీర్ఘకాలంలో ఇతరాత్ర అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లెక్కకుమిక్కిలి ఆపరేషన్లు చేస్తున్న వైనంపై ఇదివరకే ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు అందడంతో ఇదివరకటి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వైద్యారోగ్య శాఖ, ఐసిడిఎస్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన సిజేరియన్, నార్మల్ డెలివరీలకు సంబంధించిన వివరాలను సేకరించి తనకు సమగ్ర నివేదిక అందించాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, సిడిపిఓలను ఆదేశించారు. అత్యధికంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఎందుకు ఆపరేషన్లు జరుగుతున్నాయి, అందుకు గల కారణాలను ఆసుపత్రుల వారీగా సేకరించాలని బాధ్యతలు పురమాయించారు. ప్రతి గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు జరిగేలా చూడాలని, తద్వారా అనవసర ఆపరేషన్లను చాలావరకు నివారించవచ్చని హితవు పలికారు. అయితే కలెక్టర్ ఆదేశాలు అమలైన దాఖలాలు కనిపించలేదు. ఆమె బదిలీ అయిన తరువాత పరిస్థితి మరింతగా గాడితప్పినట్లయ్యింది. అసలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించిన డెలివరీ కేసులకు సంబంధించిన వివరాలను ఇంతవరకు కూడా పక్కాగా సేకరించలేదని తెలుస్తోంది. ఈ అలసత్వ వైఖరిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ల నిర్వహకులు సిజేరియన్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అందిన మేరకు దండుకుంటున్నారు.