నిజామాబాద్

ఆడబిడ్డల పెండ్లీ, కాన్పుల ఖర్చులిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పాటు పడుతోందని, ఆడ బిడ్డలకు పెండ్లీ, కాన్పులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పార్టీ సమావేశ మందిరంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ధరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు 70 మందికి మంత్రి పోచారం చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న సేవలను మహిళలు ఏన్నటికీ మరిచి పోరాదని చెప్పారు. లోగడ ఏప్రభుత్వాలు చేయని విధంగా మహిళల బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆడబిడ్డల కాన్పుల కోసం ఖర్చు చేసేందుకు అప్పుచేసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆలాంటి వాతావరణానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న వారికి 13 వేల రూపాయలను అందించడమే కాకుండా కీసీ ఆర్ కిట్‌ను అందించడం జరుగుతుందన్నారు. ప్రసవ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇంటి నుండి వారిని నేరుగా ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు 102 అంబులెన్స్ వాహన సదుపాయాన్ని కూడా కల్పించామని చెప్పారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఘణనీయంగా పెరిగాయని, ఇదివరకు ప్రైవేటు ఆసుపత్రుల్లోచేరి వేల రూపాయలను ఖర్చు చేసుకునే వారన్నారు. పైసా ఖర్చు చేసుకోకుండా కాన్సు చేసుకొని క్షేమంగా బిడ్డతో తల్లిని ఇంటికి చేరుకునే వాతావరణాన్ని కల్పించామన్నారు. బాన్సువాడలో ప్రసవాల కోసం ప్రత్యేకంగా వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆడబిడ్డలకు కన్న తల్లిదండ్రులకు వివాహ సమస్య తలకు మించిన బారంగా మారుతున్న నేపథ్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి బాలికల వివాహానికి గాను ఖర్చుల పేరిట ప్రభుత్వం నుండి ఆర్థిక సహయాన్ని అందించాలన్న సంకల్పంతో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను అమలులోకి తీసుకు వచ్చారని, లక్షలాది మంది ఆడ బిడ్డలకు కోట్లాది నిధులను వారి వివాహాల పేరిట ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ నార్ల సురేష్, కొత్తకొండ భాస్కర్, సంగ్రాం నాయక్, మోహన్ నాయక్, కృష్ణారెడ్డి, ఎజాజ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
* జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 20: 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన, ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మొట్టమొదటి సారిగా వచ్చిన సందర్భంగా సురేష్‌కుమార్ షెట్కార్‌ను నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చెన్న లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ బస్సుయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని, త్వరలో ఇక్కడికి కూడా బస్సుయాత్ర రానున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ సర్కార్ పాలనలో అన్నిరంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మి అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని యువకులు, నిరుద్యోగులు ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను వమ్ముచేసిందన్నారు. నిరుద్యోగులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, పత్తి, కందులకు, శనగలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదని విమర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 15టీఎంసీల నీరు దిగువన శ్రీరాం సాగర్‌కు తరలిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా నోరుమెదపలేదన్నారు. కేసీఆర్ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజానీకం గుణపాఠం చెప్తారన్నారు. సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జాజాల సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు చెన్న లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పైల కృష్ణారెడ్డి, నరహరి, కుడుముల సత్యనారాయణ, ఇమ్రాన్ సాజిద్, ముజ్జు, ఆదిమూలం సతీష్ తదితరులు పాల్గొన్నారు.