నిజామాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 20: ఆరుగాలం కష్టించి పంటలను సాగు చేసిన రైతులు దళారులకు ధాన్యాన్ని కట్టబెట్టి నష్టపోకూడదని కలెక్టర్ ఎం.రాంమోహన్‌రావు హితవు పలికారు. వారి సౌకర్యార్థమై గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరిపి, పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందాలని సూచించారు. మోపాల్ మండలం బోర్గాం సొసైటీ ఆధ్వర్యంలో తాడెం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. బడ్జెట్‌లోనూ సింహభాగం నిధులను సేద్యపు రంగానికే కేటాయించిందని గుర్తు చేశారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ముందస్తు పెట్టుబడుల రూపేణా రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.8వేల ఆర్థిక సహాయా న్ని అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. మే 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు తొలివిడతగా రైతుబంధు చెక్కులతో పాటు పాస్ బక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత రబీలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు వీలుగా జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 165 కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. రైతులు బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590, సాధారణ రకానికి రూ.1550 చొప్పున మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం విక్రయం విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తాడెం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఇటీవల మృతి చెందిన కూచన్‌పల్లి రాములు అనే రైతు కుటుంబానికి సొసైటీ ద్వారా మంజూరైన 2.50లక్షల రూపాయల పరిహారం చెక్కును కలెక్టర్ బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌ఆర్ క్రికెట్ టోర్ని ప్రారంభించిన మాజీ ఎంపీ
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 20: డివిజన్ కేంద్రంలోని స్థానిక ఆజాజ్ గ్రౌండ్స్‌లో, శుక్రవారం ఎన్‌ఎస్‌ఆర్ క్రికెట్ టోర్నిని, జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ముందుగా క్రికెట్ టోర్నీలోపాల్గొన్న జట్లతోకరచలనం చేసిన అనంతరం టోర్నినీ సురేష్‌కుమార్ షెట్కార్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేంధర్ సైతం బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు. ఈటోర్నిలోదాదపుగా 40 జట్లు పాల్గొంటున్నాయని, నిర్వహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు బహుమతులు, మెమోంటోలను అందజేయడం జరుగుతోందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెన్నలక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పైల కృష్ణారెడ్డి, నాయకులు కుడుముల సత్యనారాయణ, ఇమ్రాన్ సాజిద్, ముజ్జ, సతీష్, స్థానిక క్రికెట్ జట్టు సభ్యుల తదితరులు పాల్గొన్నారు.