నిజామాబాద్

పేద మహిళల కోసమే ఉజ్వల యోజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఏప్రిల్ 20: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ అన్నారు. అలాంటి పథకాల్లోనివే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకమన్నారు. మోర్తాడ్‌లోని ఇండియన్ గ్యాస్ కేంద్రంలో ఆ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తోందన్నారు. ప్రపంచ దేశాలు గర్వించే స్థాయిలో పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతి పేదవాడు సుఖఃశాంతులతో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం వాటయే సింహభాగమని, అయినప్పటికీ, ఆ విషయాన్ని ప్రస్తావించరని అన్నారు. దేశంలో దాదాపు 10కోట్ల కుటుంబాలు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేసుకుంటూ చేతులు కాల్చుకుంటున్నారని, దానివల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అందుబాటలోకి తీసుకవచ్చిందని అన్నారు. దాదాపు 12,800కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ 8కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తోందని, మహిళా సాధికారితే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలకు ఇది అద్దంపడుతోందన్నారు. ఈ నెల 14న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. తెలంగాణలోనూ భాజపా చాపకింద నీరులా బలం పుంజుకుంటోందని, సాధారణ ఎన్నికల్లో ఈ అంశం వెలుగు చూస్తుందని తెలిపారు. తప్పనిసరిగా 2019ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కనెక్షన్ పొందిన లబ్ధిదారులు కట్టెల పొయ్యిల వాడకాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దడివె నవీన్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇన్‌చార్జి రొయ్యాడి రాజేశ్వర్, నోముల ముత్యంరెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తీగల రమేష్‌రెడ్డి, బోగ దేవేందర్, భూమేశ్వర్, కవిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అంబళ్ల శ్రీనివాస్‌తో పాటు అంగన్‌వాడి కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.