నిజామాబాద్

ఆర్మూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 21: పట్టణ సుందరీకరణలో భాగంగా 25కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే పట్టణ అభివృద్ధికి 31కోట్లు మంజూరయ్యాయని, దీనికి అదనంగా మరో 25కోట్లు మంజూరు అయినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు 25 కోట్ల మంజూరు జివో, అడ్మినిస్ట్రేషన్ కాపీని ప్రభుత్వం జారీ చేసిందన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని సిద్ధులగుట్టపై వీధి దీపాలు, షెడ్, హాల్ నిర్మాణం, మూడు గెస్ట్ హౌస్ గదులు, మూత్రశాలలు, పార్క్ ఆధునికీకరణ కోసం 2 కోట్ల 50లక్షలు, పట్టణంలోని గోల్‌బంగ్లా వద్ద గల లక్ష్మీనర్సింహా స్వామి ఆలయానికి 25 లక్షలు, హౌసింగ్‌బోర్టు కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, విద్యానగర్ కాలనీ ఆధునికీకరణకు 25లక్షలు, జంభిహనుమాన్ మందిర ఆధునికీకరణకు 25లక్షలు, నల్ల పోచమ్మ మందిర ఆధునికీకరణకు 25లక్షలు, పిప్రిగైనీ 1300 ప్లాట్ల కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, 2వ వార్డులోని ఒడ్డెర కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, సైదాబాద్ కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, లయన్స్ క్లబ్ భవనం వెనుక ఆధునికీకరణకు 25 లక్షలు, కాపెల్లి పంథా ఆధునికీకరణకు 25 లక్షలు, మహాలక్ష్మీ కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, పెద్దమ్మ మందిరం దగ్గర ముధిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 25 లక్షలు, రామాలయం ఆధునికీకరణకు 25 లక్షలు, ముస్లీం మైనార్టీ షాదిఖానాకు కోటి రూపాయలు, రాజారాంనగర్ కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, రజక మండలికి 25 లక్షలు, శ్రీ శక్తి భవన నిర్మాణానికి 10 లక్షలు, టీచర్స్ కాలనీ ఆధునికీకరణకు 25 లక్షలు, అరుంధతీయనగర్‌కు 25 లక్షలు, బృందావన్ థియేటర్ సమీప ప్రాంత ఆధునికీకరణకు 25 లక్షలు, దేవాంగ సంఘానికి 25 లక్షలు, సరస్వతి మందిర ఆధునికీకరణకు 14 లక్షలు, మర్కజి కమిటీకి 20 లక్షలు, పట్టణ పద్మశాలి సంఘం కమిటీకి 25 లక్షలు, 11వ వార్డులోని అంబేద్కర్ కాలనీ అభివృద్ధికి 25 లక్షలు, 16వ వార్డు ఆధునికీకరణకు 15 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. అలాగే మహాలక్ష్మీ మందిరం దగ్గర, హౌసింగ్ బోర్డు కాలనీ, మల్లారెడ్డి చెరువు దగ్గర పార్క్‌ల నిర్మాణానికి 2 కోట్ల 70 లక్షలు, నిజామాబాద్ రోడ్డు దగ్గర, పెర్కిట్ మహిళా ప్రాంగణం దగ్గర, మానస హైస్కూల్ దగ్గర స్వాగత తోరణాల నిర్మాణానికి 45 లక్షలు, దోభిఘాట్, అంబేద్కర్ చౌరస్తా, ఎల్‌ఐసీ భవనం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆలూర్ రోడ్డు, ఎస్‌బిహెచ్ మెయిన్ రోడ్డు వద్ద బస్ స్టాప్‌ల కోసం 50 లక్షలు, నూతన మోడల్ కూరగాయల, మాంసాహార విక్రయ కేంద్రానికి 2కోట్ల 75లక్షలు, శ్మశానవాటికల ఆధునికీకరణకు 2 కోట్ల 65 లక్షలు, విద్యుత్ దీపాల కోసం 2 కోట్లు, వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ మైదానాల నిర్మాణానికి 2 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.