నిజామాబాద్

ఎస్సెస్సీ సప్లమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 21: జూన్ 4నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఎస్సెస్సీ సప్లమెంటరీ పరీక్షల నిర్వాహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉదయం 9:30నుండి 12.15గంటల వరకు నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు మొత్తం 2075మంది విద్యార్థులు హాజరవుతుండగా, 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఆరోగ్య సిబ్బందిని నియమించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వినోద్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.