నిజామాబాద్

ప్రజావాణికి 44 పిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 21: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 44 పిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ విభాగంలో 16, జిల్లా పంచాయితీ అధికారి 9, విద్యాశాఖ 3, పశుసంక్షేమ విభాగం 2, గ్రామీణ నీటి సరఫరా 2, హోమ్‌శాఖ 2, వ్యవసాయశాఖ 2, బిసి కార్పోరేషన్ 2, ఎలక్టిసిటీ 2, ఎస్సీ కార్పోరేషన్ 4, డి ఆర్ డి ఓ 1, మున్సిపాలిటీ 1, మొత్తం 44 పిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఆర్‌డిఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, డిఆర్‌వో మాణిమాల తదితరులు పాల్గొన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతుల బారులు
నందిపేట, మే 21: గత పది రోజులుగా రెవెన్యూ అధికారుల నుండి పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కులు తీసుకున్న రైతులు, నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలోనిల్చోగా, పంపిణీ సమయా ల్లో అందుబాటులోలేని రైతులు పాస్‌బుక్‌లు, చెక్కులకోసం రెవెన్యూకార్యాలయం ఎదుట బారులు తీరారు. మండలంలోని 30 రెవెన్యూ గ్రామాల్లో 9603 మంది రైతులకు ఈనెల 10నుండి 18వరకు ఆయాగ్రామాల్లో పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేపట్టిన విషయం విధితమే. పది రోజులు గా నిర్వహించిన కౌంటర్ల ద్వారా 9603 మంది రైతులకుగాను 7693మంది రైతులు బుక్కులు, చెక్కులు పొందారు. మిగతా 1910మంది రైతులకు 21నుండి చెక్కులు, బుక్కులు రెవెన్యూ కార్యాలయంలోనే పంపిణీ చేస్తామని వెల్లడించడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయం నుండి బుక్కులు, చెక్కుల కోసం తహశీల్ కార్యాలయంలో గ్రామాలవారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఎన్‌ఆర్‌ఐల కుటుంబ సభ్యులు బుక్కులు, చెక్కులు తీసుకునేందుకు అధికారులను బతిమాలినా, అధికారులు తిరస్కరించారు. భూయజమానుల చేతికే చెక్కులు, బుక్కులు పంపిణీ చేస్తామని స్పష్టం చేస్తూ, అలాంటి వారి బుక్కులు, చెక్కులను వారి వద్దనే పెట్టుకున్నారు. రైతుబంధు చెక్కులను ఒక్క ఆంధ్రాబ్యాంకుకే రాసి ఇవ్వడంతో, నగదు పొందేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని నూత్‌పల్లి, నందిపేట్‌లలోనే రెండు ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లు ఉండటంతో ఈ రెండు బ్రాంచ్‌ల వద్ద నగదు కోసం వచ్చే రైతులతో కూలలో వేచిఉంటున్నారు. ఆయా బ్రాంచ్‌ల్లో ఖాతాలు ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకు అధికారు లు నగదును చెల్లిస్తున్నారని, మిగతా రైతులకు చెల్లించడంలేదంటూ పలువురు ఆరోపించారు. దీంతో ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో వందలాది మంది రైతులు చెక్కులు పట్టుకుని ఎండలో బారులు తీరుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ బ్యాంకులోనైనా నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తే ఎంతో సౌకర్యంగా ఉండేదని, అధికారులు సమాలోచనలు చేసుకుని నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.