నిజామాబాద్

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ పాటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 21: కేంద్ర క్రీడ యువజన వ్యవహారాల శాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను సోమవారం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ పాటిల్ మాట్లాడుతూ కామారెడ్డి, ఏల్లారెడ్డి, గాంధారి మండల కేంద్రాల్లో స్టేడియాలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అందుకు సానూకులంగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ త్వరలోనే స్టేడియాలు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారన్నారు.

బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన
రామారెడ్డి, మే 21: రైతుబంధు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టినప్పటికి బ్యాంక్ మేనేజర్ల తీరు రైతులకు శాపంగా మారింది. సోమవారం మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో ఎస్‌బిఐ బ్యాంక్ ముందర పడిగాపులు కాశారు. వివిధ గ్రామల నుండి రైతులు తమ పాస్‌పస్తకాలు-చెక్కులు చేత పట్టుకోని ఉదయం చేరుకున్నారు. బ్యాంక్ సమయానికి బ్యాంక్ సిబ్బంది చేరుకున్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రైతలు మేనేజర్ బయటకు వచ్చి బ్యాంక్‌లో మనీ లేదు మనీ వెస్తే ఇవ్వగలం అని చెప్పడంతో రైతన్నలు ఒక్కసారిగా బెంబెల్ ఎత్తిపోయారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా బ్యాంకర్లు డబ్బు పంపిణీ చేయాలని ఆదేశాలుఉన్న మేనేజర్ తీరును తప్పు పట్టారు. ఎస్‌బిఐ ఖాతాలు ఉన్నవారందరికి ఈ డబ్బును మళ్లించాలని ప్రయత్నాలు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. అంతలోనే స్థానిక ఎస్‌ఐ.సురేష్ ప్రత్యేక్షమై రైతులకు నచ్చచెప్పడంతోఆందోళన సద్దుమనిగింది.

గొర్రెల మందపై కుక్కల దాడీ
రామారెడ్డి, మే 21: గొర్రెల మందపై కుక్కల దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామం భట్టు తండాకు చెందని రామవత్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం , రోజు వారిగ మేత మేపడానికి గొర్రెల మంద దగ్గరికి వెళ్లి చూడగా 14 గొర్రెలు కుక్కల దాడి చేసి చంపేసినవని సుమారు వీటి విలువ 50వేల వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించాడు.