నిజామాబాద్

నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 12: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కనీసం పక్షం రోజులకోసారైనా నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగరంలోని త్రీటౌన్, రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ జరిపారు. అదేవిధంగా బోధన్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలలో నిర్బంధ తనిఖీలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో పోలీస్ కమిషనర్ కార్తికేయ స్వయంగా పాల్గొంటున్నారు. అధికారులు, సిబ్బందిని ఒకరోజు ముందుగా కార్డెన్ సెర్చ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని సమాచారం అందిస్తూ, ఎక్కడ నిర్వహించాలనే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే వారికి తనిఖీల సందర్భంగా ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా పాటించాల్సిన చర్యలపై సీ.పీ, ఇతర పోలీసు అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. అనంతరం తెల్లవారుజామున తాను ఎంపిక చేసిన ప్రాంతంలో సీ.పీ కార్తికేయ భారీ సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్బంధ తనిఖీలు జరిపిస్తున్నారు. కనీసం 250 నుండి 300మంది వరకు పోలీసులు కార్డెన్ సెర్చ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు నేరాల నియంత్రణ కోసం పాటించాల్సిన పద్ధతులపై సూచనలు చేస్తూనే, సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామున రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతంగా పరిగణించబడే నీలా గ్రామంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సీ.పీ కార్తికేయ నేతృత్వంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రఘు, శివకుమార్, ఎన్‌ఐబీ ఏసీపీ మహేశ్వర్, ఏఆర్ విభాగం ఏసీపీ రవీందర్‌లతో పాటు 9మంది సీఐలు, సుమారు 200మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటి తలుపు తడుతూ క్షుణ్ణంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేని 73ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోరిక్షాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనుమానాస్పదంగా వ్యవహరించిన పది మందిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 4గంటలకు ప్రారంభమైన తనిఖీలు ఉదయం 6.30గంటల వరకు కొనసాగాయి. ఇంటింటికి తిరుగుతూ అన్ని వివరాలను ఆరా తీశారు. వాహన పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తూ, ఇళ్లను ఎవరికి అద్దెకు ఇచ్చారు, పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా? తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతోందని, ఎలాంటి నేర కార్యకలాపాలతో సంబంధం లేని సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని సీ.పీ పేర్కొన్నారు. తనిఖీల అనంతరం స్థానిక పాఠశాల ఆవరణలో స్థానికులతో సీ.పీ సమావేశమై పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిన సందర్భంలో సదరు వ్యక్తుల ఆధార్ కార్డును క్షుణ్ణంగా పరిశీలించాలని హితవు పలికారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కాలనీలో సంచరిస్తున్నట్టు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద తప్పనిసరిగా సీ.సీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. కార్డెన్ సెర్చ్‌లో పోలీసులకు స్థానిక సర్పంచ్ బండారు పోశెట్టి, మాజీ సర్పంచ్‌లు రఘు, లింబాద్రి, మహ్మద్ ఈసా తదితరులు సహకరించారు.