నిజామాబాద్

పంచాయతీలకు ప్రత్యేక అధికారుల జాబితా సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూలై 12: సర్పంచ్‌ల పదవికాలం ముగియనున్నందున ప్రత్యేక అధికారుల నియామకానికి జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్టస్థ్రాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మంత్రి నాగర్ కర్నూల్ జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్లతో మాట్లాడుతూ, ఈ నెలాఖరు వరకు సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్నందున, గ్రామాల్లో పాలన సవ్యంగా కొనసాగించేందుకు గాను ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 12,751గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉందన్నారు. ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, డిప్యూటీ తహశీల్దార్లు, పంచాయతీరాజ్ ఇఓ పీఓఆర్‌డీలు, ఎంఇఓలు, మండల వ్యవసాయ శాఖ తదితర తదితర శాఖల్లో పని చేస్తున్న అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయంలో అత్యంత శ్రద్ధ కనబర్చి రెండు, మూడు రోజుల్లో జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించారు. హరితహారంలో వచ్చే సంవత్సరం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసి 100కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినందు, ఆ దిశగా నర్సరీల ఏర్పాటుకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ గ్రామంలో ఏయే మొక్కలు కావాలో వాటిని పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో విజయవంతం చేయాలని సూచించారు. అంతకుముందు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ తదితరులు కలెక్టర్లతో మాట్లాడారు. వచ్చే సంవత్సరం హరితహారానికి గ్రామీణ ప్రాంతాల్లో 75కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 25కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి లక్ష మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారిగా ఎన్ని మొక్కలు నాటాలో లక్ష్యాలు పంపిస్తామని, మొక్కలు విత్తడానికి అవసరమైన మట్టిని కలుపుకోవడం, పాలథిన్ సంచుల ఏర్పాటు తదితర కార్యక్రమాలు సిద్ధం చేసుకుని, అక్టోబర్ కల్లా నర్సరీలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కాగా, నిజామాబాద్ నుండి కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 393గ్రామ పంచాయతీలకు గాను 14గ్రామ పంచాయతీలు మున్సిపాల్టీల్లో విలీనం కానున్నాయని, 151 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఈ సంవత్సరం హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లుకు అధికారులకు అదేశాలు జారీ చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పీడీఓ కృష్ణమూర్తి, డీఎఫ్‌ఓ ప్రసాద్, డీఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఇఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.