క్రైమ్/లీగల్

గుండెపోటుతో పోచారం ఉప సర్పంచ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూలై 13: ఎడపల్లి మండలం పోచారం గ్రామ ఉప సర్పంచ్ గైని పోచయ్య(ఎల్‌ఐసి) శుక్రవారం తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందారు. నాలుగైదు రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో పోచయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, గుండెకు రక్తం సరఫరా అయ్యే రెండు వాల్స్ బ్లాక్ అయ్యాయని, వాటి స్థానంలో స్టంట్స్ వేయాలని సూచించడం జరిగిందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీలో చికిత్స అందించేందుకు ఆసుపత్రి నిర్వహకులు ఏర్పాట్లు చేయగా, గురువారం అనుమతులు లభించాయి. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రిలో స్టంట్స్ వేసేందుకు వైద్యులు థియేటర్‌కు తీసుకెళ్లడం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక స్టంట్ వేసిన తర్వాత రెండవ స్టంట్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో పోచయ్య థియేటర్‌లోనే తుది శ్వాస విడిచారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే పోచయ్య ఉప సర్పంచ్‌గా ప్రజలకు సేవలు అందిస్తునే, ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఉప సర్పంచ్ గైని పోచయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోచయ్య పార్థీవ దేహానికి శనివారం పోచారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.