నిజామాబాద్

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, జూలై 13: దేశంలో ఎక్కడా లేని విధంగా తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగాయిపల్లి, క్యాసంపల్లి, ఉగ్రవాయి గ్రామాల్లో 75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందకు రాష్ట్రంలో 504 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. విదేశీ విద్యా నిధి కింద 20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్బిణీలకు మెరుగైన వైద్యం అందించి కేసీఆర్ కిట్‌తో పాటు 12 వేల రూపాయాలు అందజేస్తున్నామన్నారు. ఆడ పిల్లలు భారం కావోద్దని ఉద్దేశ్యంతో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా 1 లక్షా 116 రూపాయాలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. రైతు బందు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నామన్నారు. నియోజవకర్గంలో 1700 రెండు పడగ గదుల ఇండుల్మంజూరు చేసి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీప లద్దూరి మంగమ్మ, వైస్ ఎంపీపీ కృష్ణాజీరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, సర్పంచ్‌లు అంజమ్మ, భారతి, బాల్‌కిషన్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి అంజల్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు రవితేజ గౌడ్, నిట్టు లింగారావు, కట్లకుంట రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ముల్క రాజు, వెంకట్‌రావు, నీరడి బాల్‌రాజు, నాయకులు సాయాగౌడ్, మోహన్‌రావు, సంగమేశ్వర్, బాల్‌రాజు, అబ్దూల్ హాపీజ్, ఎల్లయ్య, అంజల్‌రెడ్డి, తోట లింగం, ఎంపీటీసీలు, నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బాల వికాస సహకారంతో
900 వాటర్ ప్లాంట్లు ప్రారంభం
బాల వికాస సంస్థ సహాకారంతో నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 900 వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన్నట్లు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని లింగాయిపల్లిలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాలో జన్మించిన బాలక్క విదేశాలల్లో ఉంటూ తన దేశానికి ఏవైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో బాల వికాస సంస్థను స్థాపించి దాని ద్వారా గ్రామాల్లో శుద్దమైన నీటిని సరఫరా చేసేందుకు గాను బాలవికాస వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు పూనుకున్నారన్నారు. అంతేగాకుండా పాఠశాలలు, గ్రామాల అభివృద్దికి సైతం పలు నిధులను అందజేస్తామన్నారు.

పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణను ఎత్తివేయాలని..
హిందూ వాహిని రాస్తారోకో
మోర్తాడ్, జూలై 13: స్వామిజీ పరిపూర్ణానందంపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్‌లో శుక్రవారం హిందూ వాహిని సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. మోర్తాడ్ మార్కెట్‌యార్డు నుండి కాషాయ పతాకాలను చేతబూని, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలంతా జాతీయ రహదారిపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ జనార్ధన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ ప్రముఖ్ పిల్లి ఈశ్వరయ్యతో పాటు వివిధ పార్టీల నేతలు, హిందూ వాహిని సభ్యులు మాట్లాడుతూ, హిందూ వ్యతిరేక ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆరాధ్య దైవంగా పూజించబడుతున్న శ్రీరాముడిని విమర్శిస్తూ కొంతమంది పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ వ్యతిరేక ప్రచారంపై గళమెత్తిన స్వామిజీపై నగర బహిష్కరణ విధించడం సబబు కాదన్నారు. స్వామిజీపై విధించిన బహిష్కరణ ఎత్తివేయాలని, ఇకముందు హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని హిందూ వాహినికి మద్దతు పలికారు.