నిజామాబాద్

కౌన్సిలర్లకు షాకిచ్చిన ఎంపీ కవిత ‘క్లాస్’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూలై 17: బోధన్ బల్దియా చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై అవిశ్వాస రాజకీయాల సంగతెలా ఉన్నప్పటికీ నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లు మాత్రం నేడు చుక్కలు లెక్కబెడుతున్నారు. ఎంత జోష్‌గా సంతకాలు చేసి హంగామా చేసారో నేడు అదే స్థాయిలో పొరపాటు చేశామంటూ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన ఎంపీ కవిత గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో సంతకాలు చేసిన కౌన్సిలర్లకు సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవిశ్వాసంలో నెగ్గి తీరుతామంటూ ఘంటాపథంగా చెప్పుకున్న ఎంఐఎం కౌన్సిలర్ల జెట్ స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు చక్రం తిప్పిన ఎంపీ కవిత సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లను సైతం గాడిలో పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాబోయేది ఎన్నికల సమయం కావడంతో అవిశ్వాసం వలన పార్టీకి అప్రతిష్ట కలిగే ప్రమాదం ఉందని గ్రహించిన ఎంపీ బోధన్ బల్దియా అవిశ్వాస వ్యవహారాన్ని పూర్తిగా తన చేతిలోనికి తీసుకుని హైదరాబాద్ నగర కేంద్రంగా చక్రం తిప్పి ఒకే ఒక్కరోజులో అవిశ్వాస వేడిని చల్లబరిచేశారు. ఎంపీ కౌన్సిలర్లకు తీసుకున్న క్లాస్‌తో కౌన్సిలర్లు ఏమి తోచక ఒక్కొక్కరుగా మాట్లాడుకుని తాము అవిశ్వాసానికి దూరమంటూ స్పష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి అధికార తెరాసతో పాటు ఇతర పార్టీల నుండి తెరాసలో చేరిన వారితో కలిపి మొత్తం 13 మంది కౌన్సిలర్లు శాసనసభ్యుడు షకీల్ అహ్మద్ వద్దకు చేరుకుని తామంతా చైర్మన్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా ఈ వ్యవహారంలో కీలక పాత్రను పోషించి కౌన్సిలర్ల సంతకాల సేకరణలో చురుకుగా పాల్గొన్న ఏడవ వార్డు కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ మంగళవారం హైదరాబాద్ నగరానికి వెళ్లి ఎంపీ కవితను కలిసి తన మద్దతును ప్రకటించారు. అలాగే మరో ఇద్దరు బిజెపి కౌన్సిలర్లలో ఒకరు శాసనసభ్యుని వద్దకు వెళ్లి మద్దతు తెలుపుతున్నానని ప్రకటించగా మరో కౌన్సిలర్ హైదరాబాద్ నగరంలో ఎంపీ వద్దకు తన కుల సంఘం పెద్దలతో వెళ్లి కలిసి తన మద్ధతును ప్రకటించారు. ఒకే రోజు పద్నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతునిచ్చేది లేదంటూ ఏకత్రాటిపైకి రావడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంపీ కవిత కౌన్సిలర్లకు తీసుకున్న క్లాస్ సత్ఫలితాన్నివ్వడంతో బల్దియా రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడి పోయాయి. అంతేకాకుండా కౌన్సిలర్లలో కూడా ఆందోళన వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఏ మాత్రం దూకుడుగా వ్యవహరించినా అధిష్టానం అటువంటి వారిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బూత్ కమిటీల సమావేశంలో కూడా ఎంపీ కవిత ఈ విషయాన్ని వేదిక సాక్షిగా ప్రకటించారు. నాయకులు అనే వారు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని, అలాగే తమ ఇంట్లో కూడా అదే విధంగా మెలగాలని, పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తే నాయకులు కారంటూ పరోక్షంగా ద్వితీయ శ్రేణి నాయకులందరికి హెచ్చరించారు. బల్దియా అవిశ్వాసం విషయంలో ఒకరిద్దరు నాయకులు అనుసరించిన తీరు కూడా ఎంపీని ఆగ్రహానికి గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నాయకులపై కూడా ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారని వారు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్నికల సమయమో లేక పార్టీని దారిలో పెట్టే ప్రయత్నలో తెలియదు కానీ బోధన్ మున్సిపాలిటీ విషయంలో ఎంపీ తీసుకుంటున్న చర్యలు పార్టీ వర్గాలను దారిలో పెట్టడమే కాకుండా ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారాయి.