నిజామాబాద్

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూలై 21: రాబోయే 2019 అసేంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, నియోజకవర్గ సెగ్మెంట్ ఇంచార్జి జాజాల సురేందర్ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల స్థాయి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే 2019 అసేంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకోసం ప్రతీ ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికుల్లా పని చేయాలని అన్నారు. ఇటీవల చేసిన పాదయాత్రలోప్రజలు కాంగ్రెస్ పార్టీని మరింతగా ఆదరిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ శక్తిప్రాజెక్ట్‌లోసభ్యత్వ నమోదు చురుకుగా సాగుతోందన్నారు. ఈయాప్‌లోకార్యకర్తలు తమ పేర్లను నమోదు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లై అని అన్నారు. శక్తిప్రాజెక్ట్‌లో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తుందన్నారు. అధిష్టాణం ఎవ్వరికి టికెట్ ఇచ్చిన పార్టీ తరపున అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేస్తాం అన్నారు. సమావేశానికి ముందు నియోజకవర్గ కో-ఆర్డీనేటర్‌గా ఇటీవల నియమితులైన నర్సింహరావును, నియోజకవర్గ ఇంచార్జి, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లామహిళా అధ్యక్షురాలు జమునా రాధోడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాల సభ్యులకు పది లక్షల రూపాయల వడ్డీలేని రుణాన్ని ఇస్తుందని అన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. అనంతరం నియోజకవర్గ కో-ఆర్డీనేటర్ నర్సింహరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలోకాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మంచి హుషారుగా ఉన్నారని, పార్టీలో ఎలాంటి విభేధాలు లేవని అన్నారు. ఏమైనా ఉంటే వారందిరిని కలుపుకుని, సమన్వయం చేసి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా పార్టీ తరపున అభ్యర్థి గెలుపుకు కృషిచేస్తామన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయడమే ఏకైక లక్ష్యంగా అందర్ని కలుపుకుని, బూత్ స్థాయినుంచి పార్టీ పటిష్టతకు కృషి చేయడం జరుగుతోందన్నారు. మొత్తం 255 బూత్ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థాయినుంచి పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాద్యక్షులు ఫతియోద్దిన్, కృష్ణారెడ్డి, కుడుముల సత్యనారాయణ, ఇమ్రాన్ సాజిద్, మాజీ ఎంపీపీ బాల్యానాయక్, మండల యూత్ అధ్యక్షులు జగన్ గౌడ్, నాగం రాజయ్య, చెర్ల సాయులు, బి.లింగం తదితరులు పాల్గొన్నారు.