నిజామాబాద్

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూలై 21: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని పీఆర్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్‌రావు చెప్పారు. శనివారం సాయంత్రం ఆర్మూర్‌లో పీఆర్‌టీయు డివిజన్ తరపున ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కమలాకర్‌రావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, వృత్తి విద్యా ఉపాధ్యాయులు నష్టపోయిన సర్వీస్‌ను ఇప్పిస్తానని అన్నారు. టీచర్ల ప్రమోషన్ల కోసం కృషి చేస్తానని, 398 ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇప్పిస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆర్మూర్ పట్టణంలోని కొత్తబస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా లయన్స్ భవన్ వరకు టాప్‌లేని జీపుపై అభివాదం తెలుపుతూ ర్యాలీ సాగింది. అనంతరం కమలాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలందర్, కోటేశ్వర్‌రావు, ఎం.రాజన్న, అశ్వాక్ అహ్మద్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కార్యదర్శి గోపాల్, జిల్లా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, శంకర్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.