నిజామాబాద్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఆగస్టు 17: బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఎంబరి నడిపి నర్సయ్య(50)అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నర్సయ్య గురువారం పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి శుక్రవారం వరకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పంట పొలానికి వెళ్లి చూడగా, విద్యుత్ షాక్ తగిలి మృతి చెంది కనిపించాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
నేలకొరిగిన భారీ చింత చెట్టు
ఎల్లారెడ్డి, ఆగస్టు 17: డివిజన్ కేంద్రం సమీపంలోని స్థానిక పెద్ద చెరువుకట్టదిగువన గల భారీ చింత చెట్టు, భారీ వర్షానికి ఓవైపుకు వంగి కూలి పోయింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతోపాటు గురువారం కురిసిన వర్షానికి చింత చెట్టు మొదలు బాగంలో మట్టి కోతకు గురై క్రమేపీ బరువుకు వంగుతూ అదే రోజు రాత్రి సమయంలోభారీ వృక్షం చెరువులోపలి వైపుకు కూలిపోయింది. దీంతో చెరువుకట్టపైన గల బీటి రోడ్డు టేపర్ కొంత మేర పాడైంది. భారీ చెట్టు రోడ్డుమీద పడి ఉండి ఉంటే భారీ నష్టం వాటిల్లి ఉండేదని, స్థానికులు వాహన దారులు చర్చించుకుంటున్నారు.