నిజామాబాద్

ముసురేసింది.. ముంచెత్తింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, ఆగస్టు 17: రైతాంగాన్ని ముసురు మురిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. నీటి జాడలు లేని చెరువులు, కాల్వలు, కుంటలు మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో జలసిరితో నిండుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పంటల సాగు పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారాయి. ఆశించిన స్ధాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులకు సాగు దిగులు పట్టుకుంది. వానాకాలం ఆరంభంలో మురిపించిన వానలు తదనంతరం దూరం కావడంతో రైతులు ఆందోళన చెందారు. వేసిన పంటలకు సకాలంలో సరిపడా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టే దశకు చేరుకున్నాయి. సమృద్ధిగా వానలు పడకపోవడంతో చెరువులు, కాల్వలు, కుంటల్లో నీటి జాడలు కనిపించకుండాపోయాయి. అటు వర్షాలు పడక, ఇటు సాగునీటికి దారులు కనిపించక రైతులు లబోదిబోమన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దాహంతో అలమటిస్తున్న పంటలకు ముంచెత్తిన ముసురు దాహర్తిని తీర్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వరుణుడు అడపాదడపా కరుణించినా పంటల సాగు గట్టెక్కినట్లేనని రైతులు ధీమాను కనబరుస్తున్నారు. జిల్లాలో వరి సాగుకు రైతులు అధిక ప్రాధాన్యతను చూపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇతర పంటల సాగుకు ముందుకు వచ్చారు. జుక్కల్ నియోజకవర్గంలో వరి సాగుకు బదులు మినుము, పెసర, మొక్కజొన్న, సోయా పంటలను వేసుకున్నారు. పంటలు నీటి తడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వాతావరణం వర్షం కురుస్తుండటంతో వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వర్షాకాలం ఆరంభమైన నాటి నుండి జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల మినహా మిగితా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతానికి కంటే తక్కువగా లోటు వర్షాపాతం నమోదైనట్లు రికార్డులు చూపుతున్నాయి. ఆగస్టు మాసం నాటికి నమోదు కావాల్సిన వర్షాపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సాగుదీత కష్టమైన పనేనని రైతులు దిగాలు చెందారు. కాగా, బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతులు పంట సాగును గట్టెక్కించుకోవచ్చునన్న భరోసాతో కనిపించారు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులకు కాసింత ఉపశమనం కల్పించినప్పటికీ సరిపడా వర్షాల జాడ కనిపించక వారిలో నిరుత్సాహం పెల్లుబికింది. రైతులకు వరప్రదాయినిగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు లేకపోవడంతో ఆయకట్టు రైతాంగం తీవ్ర ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కురిసిన ఈ వర్షం వారిలో ఎనలేని ఆనందం నింపింది. అదే విధంగా ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురియకపోవడంతో దిగువన ఉన్న నిజాంసాగర్, సింగీతం, కల్యాణి ప్రాజెక్టుల్లోకి వరద నీరు రాలేకపోయింది. తుఫాన్ ప్రభావంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ఉన్న 32,167 చెరువులు నీటికళను సంతరించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటి కింద సుమారు లక్షా 70వేల ఎకరాల పంటలు సాగు చేసుకునే వీలు ఏర్పడుతోంది. ఏదిఏమైనా ఆగస్టు మాసం చివరి వారం వరకు ఇలాంటి మరో రెండు మూడు భారీ వర్షాలు కురిస్తే రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు.