నిజామాబాద్

శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఆగస్టు 17: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం వర్షాకాల సీజన్‌లో మునుపెన్నడు లేని విధంగా 78,860క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నిర్మల్, నాందేడ్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో పాటు గడ్డెన్నవాగు మిగులు జలాలు తోడు కావడంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం ఉదయం వేళలో 1065.70అడుగులు 21.40టీఎంసీల వద్ద ఉన్న వరదనీరు సాయంత్రానికి 1067.40అడుగులు 24.27టీఎంసీలకు చేరుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు 12గంటల వ్యవధిలో రిజర్వాయర్‌లోకి 3టీఎంసీల వరదనీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ వేగంగా నిండుతుండటంతో ఆయకట్టు రైతులు సాగు చేసిన పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటు 1063.00అడుగుల వద్ద ఉన్న లక్ష్మికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు నీరు చేరడంతో లక్ష్మికాల్వ ఆయకట్టు రైతులతో పాటు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు కూడా నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలతో పాటు వేసంగి పంటలకు సైతం సరిపడా నీరు లభించనుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వచ్చి చేరుతున్న నీరు
నిజాంసాగర్, ఆగస్టు 17: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయంలోనికి, శుక్రవారం 226 క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్ జలాషయంలోనికి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తుందని, ప్రాజెక్ట్ డీఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోగల నిజాంపేట్, రాంరెడ్డిపేట్, శంకరంపేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లోనికి వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ఇప్పటి వరకు జలాషయంలోఇన్ ఫ్లో రాలేదని, శుక్రవారం నుంచే ప్రారంభ మైందన్నారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా 1384.42 అడుగుల నీరు నిల్వఉందని డీఈఈ తెలిపారు. 17.802 టీఎంసీలకు గాను 2.255 టీఏంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
ప్రమాద కరంగా పెద్దపూల్ బ్రిడ్జి
నిజాంసాగర్, ఆగస్టు 17: మండల కేంద్రంలోని మంజీరా పెద్దపూల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నైజాం నవాబుల కాలంలోనిర్మించిన పెద్దపూల్ బ్రిడ్జిపై పెద్దపెద్ద గుంతలు పడి, వర్షపునీటితోనిండి ప్రమాదకరంగా మారిందని, వాహన దారులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు వాహన దారులు గుంతల్లో పడి గాయాలపాలైయ్యారు. సంబందిత అధికారులు గుంతలు పూడ్చడంలోనిర్లక్ష్యం వహించడం వల్లనేప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని, వాహన దారులు, ప్రజలు కోరుతున్నారు.

సింగీతం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన డీఈఈ
నిజాంసాగర్, ఆగస్టు 17: మండలంలోని సింగీతం ప్రాజెక్ట్ జలాషయాన్ని, శుక్రవారం ప్రాజెక్ట్ డీఈఈ దత్తాత్రి పరిశీలించారు. ప్రాజెక్ట్ జలాషయంలోనికి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతోందని డీఈఈ తెలిపారు. ప్రాజెక్ట్‌లోనికి సుమారుగా 200 క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతొందన్నారు. ఇలాగే భారీ వర్షాలు కురిస్తే జలాశయం పూర్తిస్థాయిలోనిండుతొందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పూర్థి స్థాయి నీటి మట్టం 416.65 మీటర్లు కాగా 415.15 మీటర్ల నీరు నిల్వఉందని తెలిపారు.