నిజామాబాద్

రైతు బీమాకు బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, ఆగస్టు 17: రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఆగస్టు 14నుండి అమలులోకి తీసుకువచ్చిన రైతు బీమా పథకానికి రైతులు బోణి కొట్టారు. రైతులు అనారోగ్యంతో మృతి చెందినా, లేక సాధారణంగా మృతి చెందినప్పటికీ వారికి బీమా వసతి వర్తించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే రైతు మృతి చెందితే, ఆ కుటుంబానికి ఆసరా లేకుండాపోతుందన్న ఆలోచనతో వారి కుటుంబంలోని నామినీ వ్యక్తులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఆర్థిక సహాయం అందే విధంగా పథకాన్ని రూపొందించడంతో రైతు కుటుంబాలకు ధీమా కల్పించినట్లైంది. వ్యవసాయ సాగులో భాగంగా నిత్యం పంట పొలాల్లో తచ్చాడే రైతులు ప్రమాదానికి చేరువలో ఉంటారు. పంట భూముల్లో విద్యుదాఘాతం, పాము కాటు ఇతరాత్ర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా అనారోగ్యంతో పాటు వయస్సు పైబడి సాధారణంగా మృతి చెందిన, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెంచిన రైతులకు కూడా బీమాను వర్తించే విధంగా వెసలుబాటు కల్పించడంతో రైతులకు అన్ని విధాలుగా పథకం లబ్ధి చేకూరే అవకాశం ఏర్పడింది. ఆగస్టు 14అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చిన రైతుబీమా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ఆరంభమైన నాలుగు రోజుల వ్యవధిలోనే జిల్లాలో నలుగురు రైతులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగా వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గాంధారి మండలంలో ఇద్దరు రైతులు సాధారణ మరణం చెందగా, పిట్లంలో ఒకరు, బాన్సువాడలో మరొక రైతు సాధారణ మృతి చెందినట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు వారికి ప్రభుత్వం అందించిన రైతు బీమా పథకం కింద ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి తెలిపారు. రైతు కుటుంబాల్లోని నామినీ వ్యక్తులకు ఐదు లక్షల రూపాయల నగదును అందించనున్నామని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే వీరికి ఎకరానికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం అందించడం జరిగిందని, ఈ నెల 14 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చిన బీమా వర్తింపులో భాగంగా మృతి చెందిన రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు రైతులు తుది శ్వాస వదలడంతో వారి కుటుంబాలకు బీమా ఆసరాగా నిలుస్తోంది. తాజాగా బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొల్ల నాగభూషణం అనే రైతు సాధారణ మృతి చెందినట్లు ఏఇఓ ధృవీకరించారు. అందులో భాగంగా బీమా పథకంలో లబ్ధి చేకూర్చే విధంగా రైతు కుటుంబ సభ్యుల నుండి ఇన్సూరెన్స్‌కు కావాల్సిన మరణ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, పాసు పుస్తకాల నకలు కాఫీలను స్వీకరించారు. రైతు బీమా పథకాన్ని అమలు చేసిన వెంటనే రైతులు మృతి చెందిన సంఘటన వివరాలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. జిల్లాలో రైతు బంధులో భాగంగా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు గాను 1,70,946 మంది రైతులు లబ్ధి పొందగా, అందులో 1,09,970 మంది రైతులకు మాత్రమే బీమా సదుపాయాన్ని కల్పించారు. బీమా వర్తిస్తున్నట్లు మూడు రోజులుగా రైతులకు ఇన్సూరెన్స్ నుండి మొబైల్ ఫోన్లలో సమాచారాలు అందుతున్నాయి. అందులో కూడా కొందరికీ సమాచారం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రైతు కుటుంబాలకు మాత్రం రైతు బీమా సదుపాయం భరోసాను కల్పించనుందని చెప్పుకోవచ్చు.