క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపేట్, సెప్టెంబర్ 8: మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సోనబోయిన అంజయ్య (35) అనే యువ రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన్నట్లు ఏఎస్సై రాజేశ్వర్ తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... ఆంజయ్య తన వ్యవసాయ భూమి వద్ద బోరుమోటార్ నడవకపోవడంతో ట్రాన్స్‌పార్మర్ వద్దకు వచ్చి చూడగా దాని పీజ్ వైరు పోవడంతో మరమ్మత్తులుచేయడానికి ట్రాన్స్‌ఫార్మర్ హైండిల్ కొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. అయితే మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరాకావడంతో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అనుషవ్వ, కుమారులు రాజు, అఖిల్, రవిలు ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నామన్నారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం..
--గ్రామస్తుల ఆగ్రహాం
పోతాయిపల్లిలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన అంజయ్య విద్యుత్ షాక్‌కు గురికావడం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య కారణమేనని గ్రామస్తులు వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు సంఘటనస్థలానికి ఆధికారులు రావాలని, వచ్చే వరకు మృతదేహాన్ని కిందికి దించేది లేదని, వారు ఆగ్రహాం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖ ఆధికారులు సంఘటన స్థలానికిచేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. తర్వాత మృతదేహాన్ని కిందికి దించారు.