నిజామాబాద్

ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, సెప్టెంబర్ 12: ఆర్మూర్ పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం సామాజిక సేవకులు పట్వారీ తులసి కుమార్, సందీప్‌ల ఆధ్వర్యంలో మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పీఓపీ గణపతి విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని, వాటి నుండి కాపాడుకునేందుకే మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీరి వెంట బాలకృష్ణాగౌడ్, సుమన్, నరేష్, సాగర్, శేఖర్ తదితరులు ఉన్నారు.

మట్టి విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులు
బాల్కొండ, సెప్టెంబర్ 12: మండల కేంద్రమైన బాల్కొండలోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ విద్యార్థులు, ముప్కాల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసి, వారి తల్లిదండ్రులకు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకే మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెరాసలో చేరిక
మోర్తాడ్, సెప్టెంబర్ 12: ఏర్గట్ల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో తెరాసలో చేరిపోయారు. బుధవారం మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి నేతృత్వంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు తెరాసలో చేరిన విషయం విధితమే. ఇందులో భాగంగానే ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ సొసైటీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ సోమ చిన్నగంగారెడ్డి, ఏర్గట్ల ఎంపీటీసీ, మోర్తాడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, మోర్తాడ్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు జావీద్, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్ తదితర నేతలంతా తెరాసలో చేరారు. చేరికల అనంతరం నేతలంతా స్థానిక తాజామాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డిని కలిసి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మట్టి గణపతుల వితరణ
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 12: మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ మంచాల జ్ఞానేందర్‌గుప్తా బుధవారం నగరవాసులకు ఉచితంగా మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, పర్యావరణ సమతూల్యతను కాపాడటంలో భాగంగా తమవంతు బాధ్యతగా మట్టి గణపతుల వితరణ చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.