నిజామాబాద్

సమాచార హక్కు చట్టం వజ్రాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 12: సమాచార హక్కు చట్టం సామాన్యుడికి వజ్రాయుధం లాంటిదని, నేటి సమాజంలో ప్రజలే రాజులని సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్, న్యాయవాది ఆనంద్ అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు దోంచంద గ్రామంలో బుధవారం సమాచార హక్కు చట్టంపై గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రజా సేవకులని, ప్రజలు కోరిన ఏ సమాచారమైన సవివరంగా అందించాల్సిందేనని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రకారంగా గ్రామాలకు కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తదితర అనేక సమాచారాల గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతం చేసేందుకు ఈ చట్టం ఒక ఆయుధంలా పని చేస్తోందని అన్నారు. దేశంలో అనేక స్కామ్‌లు బయటపడటం వెనుక ఈ చట్టమే దోహదం చేసిందన్నారు. దరఖాస్తు చేసుకున్న 30రోజుల్లో ఆ శాఖ నుండి సమాచారం పొందవచ్చని, ఒకవేళా ఆ సమాచారం సంతృప్తికరంగా లేకపోతే అప్పిలేట్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడి నుండి కూడా సమాచారం రాకపోతే రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని, 90రోజుల్లో పూర్తి సమాచారం వస్తుందన్నారు. ఈ చట్టం విషయంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. అనంతరం కరపత్రాలను అందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్
బాల్కొండ, సెప్టెంబర్ 12: బాల్కొండ మండలం నాగాపూర్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి అంగన్‌వాడి, గృహ సందర్శనలు పుస్తకం ఆధారంగా సందర్శించారు. ఏడు మాసాలు నిండిన పిల్లలకు బాలామృతంతో తయారు చేసిన అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భవతులు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కల్లు పాల్గొన్నారు.