నిజామాబాద్

మట్టి గణపతులనే పూజించాలి : జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 12: పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణపతులను కాకుండా, ప్రతి ఒక్కరు మట్టి గణపతులనే పూజించాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ కార్యాలయం ఎదుట రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ చేయగా, జేసీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఇప్పటికే పలు రకాల కాలుష్యాలు విలయతాండవం చేస్తున్న తరుణంలో కనీసం నీటి కాలుష్యనైనా నివారించేందుకు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలన్నారు.

ప్రముఖుల చవితి శుభాకాంక్షాలు
ఇందూర్, సెప్టెంబర్ 12: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, సీపీ కార్తికేయలు జిల్లా ప్రజలకు వేరువేరు ప్రకటనల్లో పండుగ శుభాకాంక్షలు తెలిపారు.