నిజామాబాద్

బీజేపీతోనే మార్పు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 12: సమాజంలో పూర్తిస్థాయిలో మార్పు తీసుకరావడం అనేది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ జయకేతనం ఎగరవేస్తామని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో బీజేపీ చేపట్టిన మార్పు కార్యక్రమంలో భాగంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉండి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకవచ్చిందని అన్నారు. బీజేపీ వల్లే సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని, నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది బీజేపీయేనని స్పష్టం చేశారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని, దాని ఫలితాలు రానున్న ఎన్నికల్లో స్పష్టమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏసీపీగా బాధ్యతలు
స్వీకరించిన శ్రీనివాస్‌కుమార్
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 12: నిజామాబాద్ డివిజన్ ఏసీపీగా శ్రీనివాస్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వర్తించిన సుదర్శన్ ఇటీవల బదిలీ కాగా, ఆయన స్థానంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ ఈ విలేఖరితో మాట్లాడారు. మహబుబ్‌నగర్‌లో ఎస్‌ఐగా విధుల్లో చేరిన తాను సైబరాబాద్‌లో 12 సంవత్సరాల పాటు సీఐగా కొనసాగడం జరిగిందన్నారు. అదే విధంగా హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో పని చేసిన తర్వాత సంగారెడ్డి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్ ఏసీపీగా విధుల్లో చేరానని తెలిపారు. డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేస్తానని, అందుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. వినాయక చవితి, మొహ్రం పండుగలను ప్రజలు ఐకమత్యంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.