నిజామాబాద్

మోదీ పాలనకు భయపడుతున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 12: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు భయపడిన 22 పార్టీలు ఒక్కటయ్యాయని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోదీ నీతిమంతమైన పాలన చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని అన్నారు.. 2014వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం మాదిరిగానే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అవినీతి రహిత పాలన సాగించాలన్న ఏకైక లక్ష్యంతో మోదీ దేశ ప్రజలను కోరితే ఆయన్ను దేశ ప్రధానిగా పట్టం కట్టారని అన్నారు. 35 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు గర్వంగా తలెత్తుకు తిరిగే విధంగా పాలన సాగిస్తున్నారని, నాల్గున్నర ఏళ్లుగా మోదీ నీతివంతమైన పాలన తట్టుకోలేని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయని, వారు ఎందుకోసం ఏకమయ్యారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రజలను దోచుకొని విదేశాలలో దాచుకున్న డబ్బును ఎక్కడ మోదీ కక్కిస్తాడోనన్న భయంతోనే వారందరు ఇప్పుడు ఏకం అవుతున్నారని ఆరోపించారు. రాఫెల్ విమానాల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బ్యాంకు అంటే ఏంటో తెలియని వారికి జన్‌ధన్ ఖతాలు తెరిచి 5 నుండి 10వేల రూపాయల వరకు లబ్దిపొందే అవకాశం కల్పించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల వారికి ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇళ్లు లేని వారికి తలెత్తుకుని తిరగేలా చేయాలని లక్ష 80 వేల ఇళ్లను ఇస్తే, వాటిని పేదవారికి అందచేయలేని స్థితి టీఆర్‌ఎస్ సర్కార్‌ది అని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీలకు 3వేల నుండి 4,500 వరకు గౌరవ వేతనం అందించడం జరిగిందని, గర్భిణిలు, ప్రసవిస్తే పుట్టిన బిడ్డకు కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలను అందిస్తే దానికి కేసీఆర్ కిట్ పేరుతో మరో 6 వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం పథకంగా పేరును కేసీఆర్ మార్చేశారని అన్నారు. కేంద్ర పథకాలు వాడుకుంటున్న కేసీఆర్ పనితీరును ఇప్పుడిప్పుడే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నూతన ఎంఎస్పీ విధానం ద్వారా పెరిగిన ధరల ప్రకారం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం జరుగుతోందని అన్నారు. మండలానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు అసహనానికి గురైన పార్టీలు ఏవైనా ఉన్నాయా అంటే అవి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, పార్టీలేనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2019 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొతంగల్ కిషన్‌రావు, బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, తుమ్మల బాలకిషన్, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ సురేందర్‌రెడ్డి, బీజేవైఎమ్ అధ్యక్షుడు ఆముదాల నరేందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, మండల కార్యదర్శి రాజలింగం ఉన్నారు.