నిజామాబాద్

బాధిత కుటుంబానికి రైతుబీమా చెక్కు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 12: రైతుబీమా పథకం ఆ కుటుంబాన్ని ఆదుకుంది. ఎడపల్లి మండలం జంలం గ్రామానికి చెందిన దొడ్డి గంగాధర్ అనే రైతు ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబానికి మంజూరైన 5లక్షల రూపాయల రైతుబీమా చెక్కును టీఆర్‌ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం సదరు రైతు ఇంటికి వెళ్లి మృతుడి భార్య దొడ్డి సువర్ణకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరాం, ఎంపీపీ రజితలు మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రైతాంగ శ్రేయస్సు కోసం అహర్నిషలు కృషి చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్యుత్ కష్టాలను దూరం చేసిన సర్కార్, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పటీష్టమైన చర్యలు తీసుకుందన్నారు. రైతాంగానికి సాగునీటి ఇక్కట్లను దూరం చేసేందుకు గాను కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరించడంతో నేడు ఏ గ్రామానికి వెళ్లినా చెరువులన్ని నిండుకుండల్లా కళకళలాడుతున్నాయని అన్నారు. అలాగే భూ ప్రక్షాళన చేపట్టి భూముల వివరాలు క్రమబద్దీకరించడంతో పాటు పంటల సాగు కోసం ఎకరానికి 4వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. అదే సమయంలో దేశానికి అన్నంపెట్టే రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి అండగా నిలువాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి రైతుకు 5లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించి ఆగస్టు 15నుండి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జంలం గ్రామానికి చెందిన రైతు దొడ్డి గంగాధర్ మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబానికి ఆ లోటు పూడ్చలేనిదే అయినప్పటికీ, 5లక్షల రూపాయల బీమా అందించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గణపతిరెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సలీం, ఆయా గ్రామాల సమన్వయ కన్వీనర్లు అయిటి సాయిలు, రాజారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దొడ్డి శ్రీనివాస్, హుడా డైరెక్టర్ మధుగౌడ్, తాజామాజీ సర్పంచ్‌లు శంకర్‌నాయుడు, సాయిలు, టీఆర్‌ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, నాగేందర్‌రెడ్డి, దుబ్బాక రవీందర్‌గౌడ్, విజయ్‌గౌడ్, కుమ్మరి నర్సయ్య, చేపూర్ లక్ష్మాగౌడ్, కుంటి అబ్బయ్య, సుభాష్, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, ఏఇఓ సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.