నిజామాబాద్

ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, సెప్టెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రవెటు యూనివర్సిటీల ఏర్పాటును నియంత్రించి, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రోఫేసర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని మాధవపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం 30 శాతం నిధలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కోనసాగిస్తున్న 100 రోజుల విద్యాపోరాట యాత్ర సోమవారం మాధవపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారానే ఉచిత విద్యను అందించాలన్నారు. కార్పోరెట్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకుని, ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేసి వౌళిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయం మంచిదికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యారంగానికి ప్రభుత్వ బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ అధ్యక్షుడు వేణుగోపాల్, అశోక్, ఎంఈఓ సెవ్లా నాయక్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవులా, నాయకులు బాబురావు, శ్యాంకుమార్, ప్రేమ్‌కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.