నిజామాబాద్

ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 19: డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లలో దాడులు నిర్వహించి, 18 గ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందని, కామారెడ్డి ఎసీఎస్‌ఓ రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోగృహవసరాలకు వినియోగించే గ్యాస్ సిలెండర్‌లను, హోటళ్లలోవినియోగిస్తున్నారన్నా పక్కాసమాచారం మేరకు సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడులు నిర్వహించిందన్నారు. ఈదాడుల్లో 18 వంటగ్యాస్ సిలిండర్‌లను స్వాధీనం చేసుకుని, 6ఏ కింద కేసులు నమోదు చేయడం జరిగిందని, ఎసీఎస్‌ఓ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్‌లను స్థానిక గాయిత్రి ఏజన్సీవారికి అప్పజెప్పడం జరిగిందన్నారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలెండర్‌లను కమర్షియల్ కింద వినియోగిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతోందని హోటల్ నిర్వహకులకు హెచ్చరించారు. సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ధాడుల్లో ఎల్లారెడ్డి, మద్నూర్, గాంధారి కామారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ నాయబ్ తహశీల్దార్‌లు రవీందర్, అజయ్‌కుమార్, మునీరొద్దిన్, చంద్రరాజశేఖర్ తదితరులు ఉన్నారు.

సునీల్ ఆర్థిక సాయం
వేల్పూర్, సెప్టెంబర్ 19: వేల్పూర్ మండలం పడిగెల గ్రామనికి చెందిన పోసాని అనే ఒంటరి మహిళకు బుధవారం ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. పోసానికి ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తోందని, ఆమె దీనస్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న సునీల్ బాధితురాలిని ఓదార్చి స్వయంగా నగదును అందజేశారు.

జీవన్‌రెడ్డిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు
ఆర్మూర్, సెప్టెంబర్ 19: ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుల సంఘాలతో మాట్లాడి టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని బలవంతంగా ప్రతిజ్ఞలు, తీర్మానాలు చేస్తున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ మైలారం బాలు ఆలియాస్ నరేష్ బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల అధికారి నిజామాబాద్ కలెక్టర్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తానని అబద్ధపు హామీలిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి కాలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రుణాలు అందక, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక రోడ్డున పడ్డారని అన్నారు. ఈ విషయాలపై ఓటర్లను చైతన్యవంతం చేస్తామని అన్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి సంపాదించిన ఆస్థులను ప్రజలకు చూపించి డిపాజిట్ రాకుండా చేస్తామని అన్నారు. జీవన్‌రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు.