నిజామాబాద్

సెంటిమెంట్ జీవన్‌రెడ్డికి ఓటమి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, సెప్టెంబర్ 19: గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవన్‌రెడ్డికి జరగబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అఖిలపక్ష నాయకులు చెప్పారు. బుధవారం ఆర్మూర్‌లో అఖిలపక్ష నేతలైన మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పోల సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేగాం యాదాగౌడ్, న్యూడెమోక్రసీ నేత ఎం.ముత్తెన్న, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీసీ బోజన్న, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జీవీ నర్సింహారెడ్డిలు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఏనాడు ప్రజా సేవ చేయని జీవన్‌రెడ్డిని గత ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే ఆర్మూర్ అభివృద్ధిని విస్మరించి సొంత లాభానికి పెద్దపీఠ వేశాడని అన్నారు. నాలుగున్నరేళ్లలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను నిర్మించుకున్నాడని, ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించలేదని, కంకర క్రషర్ ఏర్పాటు, 50 ఎకరాల వెంచర్‌కు బీటీ రోడ్డు వేసుకున్నాడని వారు ఆరోపించారు. జరగబోయే ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆలోచనతో కుల సంఘాలను బెదిరించి తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయించడం సరికాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బెదిరింపులకు ప్రజలు, ఆయా కులస్థులు లొంగవద్దని, ఓట్లను మనస్ఫూర్తిగా వేయాలని వారు కోరారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న జీవన్‌రెడ్డిని నమ్మవద్దని అన్నారు. బంగారం కేసులో ఇరుక్కొని టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండైనా వారితో కలిసి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పిప్రిలో టీడీపీ నేత సోమ లింగారెడ్డికి బలవంతంగా గులాబి కండువా కప్పి టీఆర్‌ఎస్‌లో చేరాడని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. లింగారెడ్డి టీడీపీలో ఉన్నాడని, ఏ పార్టీలో చేరలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలిస్తున్నాడని అన్నారు. ఆర్మూర్ ప్రజలు చాలా తెలివైన వారని, మోసపు మాటలతో మభ్యపెడుతున్న జీవన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాన్ శ్రీను, జిమ్మి రవి, పోశెట్టి, రాజేశ్వర్, భగత్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.

కొలువుదీరిన గణనాథులు
మోర్తాడ్, సెప్టెంబర్ 19: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో గణనాథులను ప్రతిష్ఠించారు. ఏడు రోజులుగా పూజలందుకుంటున్న గణనాథులు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం ముంబై నుండి వచ్చే రజక యువజన సంఘం సభ్యులు ఈసారి ఇరవై అడుగుల భారీ గణనాథుడిని ప్రతిష్ఠించడంతో ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తులను ఆకర్షిస్తున్నాడు. వినాయకుడి ముందు ఏర్పాటు చేసిన భారీ కంచు గంటను భక్తులు మోగిస్తూ పూజలు చేస్తున్నారు. స్థానిక రథ మండపం ముందు కేవలం రెండు ఫీట్ల ఎత్తుతోనే గణపతిని ప్రతిష్ఠించినప్పటికీ, భక్తుల మన్ననలు అందుకుంటోంది. పూర్తి బియ్యపు గింజలతోనే గణనాథుడిని తయారు చేశారు. దాదాపు నాలుగు కిలోల బియ్యపు గింజలను ఉపయోగించి గణపతి ఆకృతిని తయారు చేసి పూజలు నిర్వహిస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకుంటున్నారు. ఈసారి మట్టి గణపతుల విగ్రహాల ప్రతిష్ఠాపనకు భక్తమండళ్లు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. వినూత్న రీతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే తక్కురివాడ యువజన సభ్యులు పూర్తిస్థాయిలో మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. అనేక భక్తమండళ్లు మట్టి గణపతుల విగ్రహాలను ప్రతిష్టించేందుకే ఎక్కువగా మొగ్గు చూపాయి. ఒక్క మోర్తాడ్ మండలంలోనే దాదాపు యాభైకు పైగా భారీ విగ్రహాలను ప్రతిష్ఠించగా, బాలగణేష్ మండళ్లు కూడా అంతే సంఖ్యలో విగ్రహాలను నెలకొల్పాయి. ఏర్గట్ల మండలంలోనూ దాదాపు వందకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉండడంతో రెండు మండల కేంద్రాల్లోనూ పోలీసులు గణేష్ మండళ్ల నిర్వహకులచే సమావేశాలు నిర్వహించి, ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఆయా చెరువులను పరిశీలించి, గ్రామాభివృద్ధి కమిటీలతో చర్చిస్తూ నిమజ్జన శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గణేష్ మండపాలను సందర్శించిన ఎంపీ కవిత
కంఠేశ్వర్, సెప్టెంబర్ 19: నగరంలోని ఆయా గణేష్ మండపాలను బుధవారం అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో కలిసి నిజామాబాద్ ఎం.పీ కవిత సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో నెలకొల్పిన గణేష్ మండలిని తొలుత సందర్శించి పూజలు నిర్వహించారు. పూసలగల్లిలోని బాలాజీ భవన్‌లో, పోచమ్మగల్లిలో రవితేజ యూత్ ఆధ్వర్యంలో నెలకొన్న అరవై అడుగుల మొక్కజొన్న గణపతిని, లలితామహల్ థియేటర్ పక్కన సార్వజనిక్ గణేష్ మండలి వినాయకుడిని దర్శించకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు అర్బన్ నియోజకవర్గంలో మరోమారు బిగాల గణేష్‌గుప్తాను గెలిపించాలని కోరారు. ఆర్‌యూబీ, డ్రైనేజీలు, సైడ్ డ్రెయిన్స్, సీ.సీ, బీ.టీ రోడ్ల నిర్మాణాలతో పాటు నగరంలో సుమారు 900కోట్ల రూపాయలతో ప్రగతి పనులు చేపడుతున్నామని, దీనిని దృష్టిలో పెట్టుకుని తెరాసనుఅధికారంలోకి తేవాలని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు.