నిజామాబాద్

మన ఈవీఎంలు పవర్‌ఫుల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 19: ఇతర దేశాలకంటే కూడా మన దేశంలో ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఈవీఎంలు ఎంతో పవర్‌ఫుల్‌గా తయారు చేయబడ్డాయని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోర్టు, బార్ అసోసియేషన్ భవనంలో ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్ సంస్థ బెంగళూర్ ఇంజనీర్లు ప్రవీణ్ బృందం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, సబ్‌జడ్జీ సత్తయ్య, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జీ ఎన్.కిరణ్మయి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ రాజ్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సమక్షంలో యంత్రాల పనితీరును వివరించి మాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇతర దేశాల ఓటింగ్ యంత్రాలతో పోలిస్తేమన దేశంలో ఈవీఎం యంత్రాల్లో ఏలాంటి వైరస్ ప్రవేశించలేని పూర్తి భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉన్నట్లు అనేక పరీక్షలలో, ఫోరెన్సిక్ పరీక్షలల్లో తేలిందని అన్నారు. ఎలాంటి కాఫీకి ఆస్కారం లేకుండా, మాన్యుపులేటింగ్ కాకుండా ఆనేక సెక్యూరిటీ షీచర్‌లతో ఉన్నట్లు అనేక సార్లు కోర్టులు కూడా ధృవీకరించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఈ వీ ఎంలకు తోడుగా వీవీ ప్యాట్ మీషన్‌లు కూడా పూర్తిస్థాయి భద్రతతో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావు లేకుండా ఉన్నట్లు, ప్రతీ మీషన్‌పై పూర్తి కమాండ్ కంట్రోల్ కలిగి ఉన్నట్లు తెలిపారు. పస్ట్ లెవల్ చెక్‌లో పూర్తిస్థాయిలో క్షుణంగా పరిశీలించడం జరుగుతందని తెలిపారు. వీవీ ప్యాట్ మీషన్‌ల ద్వారా తాము ఏవరికి ఓటు వేసామో పూర్తి పారదర్శకతతో తెలుసుకోవడం జరుగుతుందని, దీనిలో వాడే పేపర్ నాసిక్‌ప్రెస్ నుంచి థర్మల్ ప్రింటింగ్ కలిగి ఉంటుందని, 5 సంవత్సరాలుపైగా భద్రత కలిగి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, బార్ అసోసియేషన్ సభ్యులు వెంకట్‌రాంరెడ్డి, శ్రీనివాసరావు, ఎంఎ. ముఖీం, అన్వర్ షరీప్, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారులెందుకు?
- బీజేపీ నేత యెండల ప్రశ్న
కంఠేశ్వర్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేని ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అవసరమా? అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ ప్రశ్నించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన వీఆర్‌ఓ పరీక్షల సందర్భంగా మెదక్ జిల్లాలో ఆడపడుచుల మంగళసూత్రాలు, మట్టెలు తీయించడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా మెదక్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకోవడం దారుణమని అన్నారు. హైందవ సాంప్రదాయాలకు విరుద్ధంగా తెరాస ప్రభుత్వం దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోందని ఆయన దుయ్యబట్టారు. పరీక్షలకు సంబంధించిన నియమ, నిబంధభలను అభ్యర్థులకు తెలుపకపోవడం శోచనీయమన్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినా, ఏ అధికారి మీద చర్యలు తీసుకలేదని అన్నారు. అసెంబ్లీ రద్దయ్యాక ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్నారు. ఇక ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ముఖ్య సలహాదారులు ఉన్నారని, వీరు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన సముచిత నిర్ణయాలు మాత్రం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. సాంస్కృతిక శాఖ ముఖ్య సలహాదారుడైన రమణాచారి పరీక్ష కేంద్రాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, అయితే సంవత్సరానికి ప్రభుత్వం వంద కోట్ల రూపాయల చొప్పున మూడేళ్లలో 300కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని చెబుతున్నారని, దీనిపై శే్వతపత్రం విడుదల చేయాలని యెండల డిమాండ్ చేశారు. నగరంలో రోడ్లన్నీ తవ్వేసి, దుమ్మూధూళిమయంగా నగరాన్ని మార్చివేశారని, ఈ భయంతో తాజామాజీ ఎమ్మెల్యే రాత్రి వేళల్లో పర్యటించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు నగరంలో పేదలకు నివేశన స్థలాలు కాని, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బిగాలను ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. విలేఖరుల సమావేశంలో రోషన్‌లాల్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు.