నిజామాబాద్

ఒక్క గుంట పంటనూ ఎండనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంట పొలాన్ని సైతం ఎండిపోనివ్వకుండా అవసరమైన మేర సాగునీరందించి పంటలను కాపాడతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటలు వేసిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, దిగుబడులు చేతికందేంత వరకు సాగునీరందించే పూచీ తమదేనని ఆయన స్పష్టం చేశారు. కోటగిరి మండలం కొడిచెర్ల వద్ద మంజీరా నదిపై 11.24కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఎత్తిపోతల పథకానికి, కోటగిరిలో 15.5కోట్లతో ఏర్పాటు చేయనున్న 132/33కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పనులకు మంత్రి పోచారం బుధవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షా 35వేల ఎకరాల్లో వేసిన పంటలకు చివరి వరకు నీటి తడులు అందించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో ఉన్న నీటి నిల్వలు రెండు తడులకు సరిపోతాయని, అదనంగా మరో తడికి అవసరమైతే సింగూరు నుండి నీటిని విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా కొడిచెర్లలో మంత్రి పోచారం సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయనను ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ సంప్రదించి సింగూరు నీటి మళ్లింపు విషయమై సంసిద్ధత తెలుపుతూ, తన తరఫున రైతులకు భరోసా ఇవ్వాలని కోరడం విశేషం. ఇదే విషయాన్ని మంత్రి పోచారం రైతులకు తెలియజేస్తూ, సాగునీటికి సంబంధించి రైతులు బెంగపడవద్దని సూచించారు. వచ్చే ఏడాది నుండి సాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసిగర్ ప్రాజెక్టులోకి తరలించి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందిస్తామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 50లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయ పంపుసెట్లను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న దరిమిలా, వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంక్షోభాన్ని నివారిస్తూ సేద్యానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే 24గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే 70 సంవత్సరాల వరకు కూడా విద్యుత్ కొరత తలెత్తకుండా 93వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రంలో 28వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించేందుకు విరివిగా సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు పుష్కలంగా నీరందిస్తూ, వారు పండించిన పంటలకు పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించి సేకరించేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని, రైతులు తొందరపడి తమ పంటను దళారులు, వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దని హితవు పలికారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు చేతికందనున్నాయని తెలిపారు. కొడిచెర్ల వద్ద చేపడుతున్న లిఫ్టును ఐదు నెలల వ్యవధిలోనే పూర్తి చేయిస్తామని, దీని వల్ల 1130ఎకరాలకు సాగునీరు సమకూరుతుందన్నారు. అదేవిధంగా మంజీర నదిలో నీటి నిల్వలు ఉండేందుకు, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందేందుకు వీలుగా 135కోట్ల రూపాయలను వెచ్చిస్తూ త్వరలోనే నాలుగు చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తెరాస నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.