క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, సెప్టెంబర్ 20: ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుక పాత నరేంద్ర కళాశాల ఎదుట గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో నల్ల యోగేష్(15), దత్తపురం సునీల్(16) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఉన్నాయి. ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. రోడ్డుకు ఒకవైపు పనులు నడుస్తుండడంతో రాకపోకలన్ని ఒకే రోడ్డు మీదుగా సాగుతున్నాయి. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు, బైక్ ఢీకొనడంతో యోగేష్, సునీల్ అక్కడిక్కడే మరణించారు. సునీల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, యోగేష్ 10వ తరగతి చదువుతున్నారని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన వీరిద్దరు బైక్‌పై ఆర్మూర్‌కు వస్తుండగా సంఘటన జరిగిందని అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అన్నారు. సునీల్ తల్లి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ తెలిపారు. ఈ విషయం తెలసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందజేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.