నిజామాబాద్

అందరికీ ఓటు హక్కు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 20: మహిళలు, యువత, దివ్యాంగులు తప్పనిసరిగా వంద శాతం ఓటు హక్కు కలిగి ఉండాలని, ఓటు హక్కు లేనివారు స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించబడుతున్న ఓటరు నమోదు కార్యక్రమంలో ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా మహిళలు, మున్సిపల్ సిబ్బందికి, ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు చైతన్యవంతం అయితేనే సమాజాభివృద్ధికి దోహదపడుతుందని, మహిళలందరూ చైతన్యవంతమై తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని తెలిపారు. జనవరి 1వ తేదీ 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు నమోదులో భాగస్వామ్యం చేయాలని అన్నారు. సమాజంలో యువత, మహిళలు, దివ్యాంగులు తప్పనిసరిగా వంద శాతం ఓటు నమోదు చేసుకోవాలని, ఈ సందర్భంగా కోరారు. ఈవీఎం, వీవీప్యాట్, ఓటింగ్ యంత్రాలు పూర్తి భద్రతతో, సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఉన్నాయని, ఈ విషయాన్ని మహిళలు తమ తోటి వారికి తెలియజేసి చైతన్యపరచాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ నేమ్ సెర్చ్ సెంటర్ హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ సత్యనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దొత్రే, మున్సిపల్ చైర్ పర్సన్ పిప్పిరిసుష్మ, ఆర్డీవో రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి, తహసీల్దార్ రవీందర్, రెవెన్యూ సిబ్బంది, తదితరుల పాల్గొన్నారు.

దిశా నిర్దేశం చేసే సీనియర్ సిటిజెన్స్
సమాజంలో దిశా నిర్దేశం చేసే సీనియర్ సిటిజెన్స్ తమ వంతు కర్తవ్యంగా ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ భవనంలో విశ్రాంత ఉద్యోగులకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల పట్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ సిబ్బంది యంత్రాల పనితీరు వివరించి, మాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ల కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో తమ వంతు కర్తవ్యంగా ఓటరు నమోదు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని, ఓటింగ్ యంత్రాల పట్ల అవగాహన కలిగి ఉండి, ఇతరులను చైతన్యపర్చాలని కోరారు. వీవీప్యాట్ యంత్రం ద్వారా 7 సెకన్ల పాటు మనపేరు, ఓటు వేసిన వారి గుర్తునెంబరు చూపుతుందని, ధర్మల్ పేపర్ ప్రింటింగ్ కలిగి 5 సంవత్సరాలకు పైగా భద్రంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ రవీందర్, తెలంగాణ స్టేట్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. విఠల్‌రావు, జనరల్ సెక్రటరీ పి. విశ్వనాథం, జిల్లా సీనియార్ సిటిజెన్ ఫోరం అధ్యక్షుడు రామాచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం. రాజన్న, విశ్రాంత ఉద్యోగులు సీనియార్ సిటిజెన్స్, తదితరులుపాల్గొన్నారు.

పోలీస్ సిబ్బందితో...
జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ సిబ్బందికి ఈవీ ఎం, వీవీప్యాట్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం పోలీస్ సిబ్బందికి, పనితీరు వివరించి, మాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌యంత్రాలు ఎవరూ ట్యాంపరింగ్ చేయాలని స్థితిలో పూర్తి భద్రతతో ఉన్నాయని, వీటిని సుప్రీం కోర్టు, హైకోర్టులు కూడా ధ్రువీకరించిన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీ పరిధిలో అవగాహన కలిగించాలని తెలిపారు.

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
* మాజీ విప్ గంప గోవర్దన్
కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 20: కామారెడ్డి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాజీవిప్ గంప గోవర్దన్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలంలోని శాబ్దిపూర్ గ్రామానికిచెందిన పరశురాంతో పాటు 70 మంది, మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సిద్దిరాంరెడ్డి, మాజీ వీడీసీ అధ్యక్షుడు రణదీర్‌రెడ్డిలతో పాటు మరో 50 మంది, గూడెం గ్రామానికిచెందిన అన్నారెడ్డి, సుంకరి బాల్‌రెడ్డి, బాల్‌లింగం, బెస్త శ్రీను, కుమ్మరి రాజుతో పాటు మరో 30 మంది, కామారెడ్డిపట్టణంకు చెందిన సిమెంట్ హమాలీ సంఘం అధ్యక్షుడు అనిల్‌తో పాటు బాల్‌రెడ్డిలతో కలిసి మరో 80 మంది, దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికిచెందిన ఎంపీటీసీ స్వామిగౌడ్, మాజీ సర్పంచ్‌లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ జీడిలత, దెబ్బ రాజయ్య, భాస్కర్, బాలయ్య, లింగంతో పాటు మరో 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్, తాజామాజీ ఎమ్మెల్యే గంపగోవర్దన్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంపగోవర్దన్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా వచ్చి భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఆసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని ఆయన పార్టీలో చేరిన నూతన కార్యకర్తలకు, నాయకులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి కేసీ ఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్‌కమిటి చైర్మన్ గోపిగౌడ్, నాయకులు నాగభూషణం, ఆత్మకమిటీ చైర్మన్ బల్వంత్‌రావ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.