నిజామాబాద్

శోభాయాత్రలో పోలీసులకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 21: వినాయక శోభయాత్రను వినాయక మండళ్ల ప్రతినిధులు, ప్రజలు ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి సమయంలో వచ్చే పుకార్లు అసలే నమ్మవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి అన్నారు. ఈనెల 22, 23తేదిల వరకు జరిగే వినాయక శోభయాత్ర రూట్ మ్యాప్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక శోభయాత్రను పురస్కరించుకుని పోలీసు బందోబస్తులో కామారెడ్డి డిఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, 25మంది ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 200మంది కానిస్టేబుల్స్, 35మంది స్పెషల్ పార్టీ పోలీసులు, ఎన్‌సీసీకి చెందిన 57మంది క్యాడెట్స్, 50మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, 50మంది ప్రత్యేక వలంటీర్లు, 30మంది యువ నేస్తాం వలంటీర్లు బందోబస్తులో విధులు నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 22నుండి సిరిసిల్లా రోడ్డులో 23వ తేది సాయంత్రం వరకు ఏలాంటి వాహనాలు అనుమతించబడవని వివరించారు. తప్పుడు సమాచారం అందించేందుకు ఎవ్వరు ప్రయత్నించిన, లేదా తప్పుడు సమాచారంతో గొడవలు సృష్టించాలని ప్రయత్నించిన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 100డయల్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. శోభయాత్రలో చిన్నపిల్లలను ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టవద్దని, వారిని గుంపులో వదలి పెట్టరాదని కోరారు. జిల్లా కేంద్రంలో రెండు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒకటి రైల్వేస్టేషన్ వద్ద మరోకటి వినాయక శోభయాత్ర ప్రారంభం అయ్యేచోట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎప్పటిప్పుడు నిఘా నేత్రాల ద్వారా పరిస్థితిని ఎప్పకప్పుడు సమీక్షించడం జరుగుతోందని అన్నారు. పోలీసు శాఖ నుండి విడుదలైన రూట్‌మ్యాప్‌ను ప్రతి ఒక్క వినాయక మండళ్ల వారు ఫాలో కావాలని కోరారు. ఒక క్రమశిక్షణతో, ఎవ్వరికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా శోభయాత్ర నిర్వహణ కోసం రూట్‌మ్యాప్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. వినాయక మండళ్ల వారు, ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీసు నిబంధనలు పాటించి, శోభయాత్రను శాంతియుతంగా జరుపుకోవాల్సిందిగా కోరారు.

ఆడబిడ్డల కానుక కల్యాణలక్ష్మి

బాన్సువాడ, సెప్టెంబర్ 21: నిరుపేద ఆడ బిడ్డలకు అండగా నిలువాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ పథకాల ద్వారా వేలాది పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ అన్నారు. శుక్రవారం పాత బాన్సువాడలో 34మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి కింద ధరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన పైకం అందించడం జరుగుతుందన్నారు. నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, వాటి వల్ల నేడు ప్రతి ఇంటికి ఏదో రకంగా లాభం చేకూరుతుందన్నారు. నిరుపేదలందరికీ మార్గదర్శకాలను బట్టి పింఛన్లను అందించడం జరుగుతుందని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూంలను మంజూరు చేస్తున్నామని, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సబ్సిడీ రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖతో రైతులకు మేలు జరిగిందని, పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమాను కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి నిరుపేదలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చేందుకు గాను లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు జంగం గంగాధర్, నార్ల ఉదయ్, ఎజాజ్, బాబా, వీఆర్‌ఓ లక్ష్మికాంత్ తదితరులు ఉన్నారు.

గణేష్ మండపం వద్ద కుంకుమార్చనలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 21: డివిజన్ కేంద్రంలోని బీసీ కాలనీలోని, సాయికృప గణేష్ మండలి వద్ద , శుక్రవారం కాలనీకి చెందిన సువాసీనీలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈసందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ పూజారి శ్రీనివాస్‌రావు సువాసినీలచే సామూహిక కుంకుమార్చనలు చేయించారు. అనంతరం సువాసినీలు, భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే న్యూఆబాదీ గణేష్ మండలి నిర్వహకులు కాలనీలోగణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి సైతం అన్నదానం నిర్వహించారు. ముందుగా వినాయకునికి ప్రత్యేక పూజలను నిర్వహించి, నైవేద్యం సమర్పించి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలోహాజరై తీర్థప్రసాదాలతోపాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈకార్యక్రమంలో సాయకృప గణేష్ మండలి నిర్వహకులు లింబేష్ నాయక్, శ్రీనివాస్, నాగభూషణం, శేర్ల భూమ య్య, న్యూఆబాది గణేష్ మండలి నిర్వహకులు ఆదిమూలం సతీష్‌కుమార్, రిటైర్డ్ హెచ్‌ఎం గంగారాం, రాములు, మాషెట్టి కృష్ణమూర్తి, భగవంత్‌రెడ్డి, రాచకొండ హరిబాబు, గౌత సంతోష్, రవిగౌడ్, కృష్ణారెడ్డి, ధనుంజయ్, నటరాజ్ పాల్గొన్నారు.