నిజామాబాద్

వినాయక మండళ్లను సందర్శించిన మంత్రి పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, సెప్టెంబర్ 23: బాన్సువాడ డివిజన్ కేంద్రంలో గత పది రోజులుగా ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను నిమజ్జణం చేసే సమయం ఆసన్నం కావడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రాత్రి అధికారులతో కలిసి డివిజన్ కేంద్రంలో ఉన్న వినాయక మండళ్లను సందర్శించి గణపయ్యలను దర్శించుకున్నారు. వినాయకుల ఏర్పాటుతో పాటు సోమవారం జరుగబోయే నిమజ్జన ఏర్పాట్లపై కూడా మండళ్ల నిర్వాహకులతో మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని పాత బాన్సువాడ, కొత్త బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ, టీచర్స్ కాలనీ, శ్రీరాం కాలనీ, చైతన్య కాలనీ, బస్టాండ్ ఏరియా, తాడ్కొల్ రోడ్, గాంధీచౌక్ ప్రాంతాల్లోని వినాయకులను మంత్రి పోచారం దర్శించుకున్నారు. అందులో భాగంగా వినాయక నిమజ్జనానికి గాను ఏర్పాట్ల తీరుపై మంత్రి ఆరా తీశారు. సానుకూల వాతావరణంలో శాంతియుతంగా నిమజ్జణ వేడుకల్లో గణనాథుడి శోభాయాత్రను చేపట్టాలని స్థానిక ఆర్‌డీఓ రాజేశ్వర్‌తో పాటు తహశీల్దార్ నారాయణ, సీఐలను ఆదేశించారు.

వినాయక నిమజ్జనంలో మంచి నీళ్ల పంపిణీ
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు, గణేష్ మండపాల నిర్వాహకులకు మంచాల శంకరయ్యగుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీటిని సరఫరా చేశారు. నగరంలోని గోల్‌హన్మాన్ మందిర్ వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయగా, ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్‌గుప్తా భక్తులకు చల్లటి మంచినీటి ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే వినాయక చవితిని పురస్కరించుకుని భక్తులకు మంచినీటి అందించాలనే ఉద్దేశ్యంతో నీటిని అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక నిమజ్జనం
బాల్కొండ, సెప్టెంబర్ 23: బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ గ్రామంలో వీరా యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. యూత్ సభ్యులు ఏకరూప దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో వినాయకుడి ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అలాగే మెండోరా మండలంలోని శ్రీ మిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు.

అలరించిన అయ్యప్ప భజన గానామృతం
బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 23: బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భజన గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తి గేయాలతో పాటు అయ్యప్ప భక్తులు చేసిన నృత్యాలు అలరింపజేశాయి. పూజల అనంతరం రాత్రి పనె్నండు గంటల వరకు అయ్యప్ప భక్తులు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణనాథుడికి మంగళ హారతులు సమర్పించుకోవడంతో పాటు వినాయకుడికి జేజేలు పలుకుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు.

అంబేద్కర్ భవనం ఏర్పాటుకు రూ. కోటి నిధులు మంజూరు
బాన్సువాడ, సెప్టెంబర్ 23: బాన్సువాడ నియోజకవర్గ స్థాయి అంబేద్కర్ భవనాన్ని బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు గాను రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గత పది సంవత్సరాల కాలంగా అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేయాలంటూ దళిత సంఘాలు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మంత్రి పోచారం వారికి కోటి నిధులను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిధులతో ఈ నెల 26తారీఖున భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల దళిత సంఘాల ప్రతినిధులు మంత్రి చేయూతపై హర్షం వ్యక్తం చేశారు.