నిజామాబాద్

మక్కలు అమ్మాక కొనుగోలు కేంద్రాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 23: రైతులు తాము పండించిన మక్కలను చాలావరకు అమ్ముకున్నారని, ప్రభుత్వం మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం విడ్డూరమని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.ప్రభాకర్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వల్ల రైతుల కంటే మధ్యదళారులకే లాభాలు అధికంగా వస్తున్నాయని అన్నారు. మోర్తాడ్‌లో ఆదివారం ఏఐకేఎంఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం క్వింటాలు మక్కలకు 1500రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించిందని, తీరా చూస్తే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు మధ్యదళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. గ్రామాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరుగుతున్నా, ప్రభుత్వం తమాషా చూస్తోందని అన్నారు. పంటలు కోతకు రాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. మొక్కజొన్న ధరను క్వింటాళుకు 2వేలకు పెంచి, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల పేరిట తెరాస సర్కార్ 9మాసాల ముందే ఎన్నికలకు రావడం అంటే ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎవరో అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ, మళ్లీ అధికారం ఇస్తే వాటిని పూర్తి చేస్తామని మాట్లాడటం ప్రజలను వంచించడమేనని అన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకుడు దేవరాం మాట్లాడుతూ, రైతులకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎస్సారెస్పీ నుండి అర టీఎంసీ నీటిని రైతులు కోరితే నీటిని ఇవ్వకపోగా, అక్రమ కేసులు బనాయించి రైతులను జైలుకు పంపారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల బృందం ఆలపించిన గేయాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కే.గంగాధర్, ఉపాధ్యక్షుడు సారా సురేష్, నాయకులు బాలయ్య, అశోక్, గంగారాం, బీడీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్కతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

నందిపేట పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ
నందిపేట, సెప్టెంబర్ 23: నందిపేట మండల కేంద్రంలో గౌడ కులానికి చెందిన 400మంది మహిళలు, పురుషులు ఊరపోచమ్మ తల్లికి ఆదివారం బోనాలు సమర్పించారు. గత సంవత్సరం పలుగుగుట్ట వద్ద గౌడ కులస్థులు పుట్ట రేణుకఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేటికి ఏడాది పూర్తి కావడంతో వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఇంటికి ఒకటి చొప్పున బోనాన్ని అలంకరించుకుని మహిళలు, పురుషులు నెత్తినెత్తుకుని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ దేవతలకు పేటలోని ఊరపోచమ్మతల్లికి బోనాలు, నైవేధ్యాలను సమర్పించి, గొర్రెలు, మేకలను బలి ఇచ్చారు. ఈ సందర్భంగా గౌడశెట్టిలు ఎల్లమ్మ, పోచమ్మతల్లి కథలను వినిపించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు వీ.రాజుగౌడ్, చింత కృష్ణగౌడ్, డైరెక్టర్లు గాండ్ల నర్సాగౌడ్, ప్రసాద్, నాందేవ్, లక్ష్మినారాయణ, పోస్టు గంగాధర్‌గౌడ్, ఏనుగుల నర్సాగౌడ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.