నిజామాబాద్

జిల్లాకు చేరిన ఈవీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 23: సమీప భవిష్యత్తులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని సన్నాహాలను పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లు ఆదివారం నిజామాబాద్‌కు చేరుకున్నాయి. బెంగళూరు నుండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా ప్రత్యేక లారీలలో ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని ఫోర్త్ టౌన్ సమీపంలో గల గోడౌన్‌లకు చేరుకున్నారు. మొత్తం వీవీ.ప్యాట్‌లు 1890, కంట్రోల్ యూనిట్లు 1750, బ్యాలెట్ యూనిట్లు 2240 రాగా, అధికారులు వాటిని సరిచూసుకుని ఈవీఎం గోడఔన్‌లోని గదుల్లో భద్రపర్చి అవసరమైన భద్రతను కల్పించారు. కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సైతం గోడౌన్‌లను సందర్శించి ఈవీఎం యంథ్రాలను పరిశీలించారు. వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2018 జనవరి 1వ తేదీ నాటికి 18సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, ఓటు హక్కు ద్వారానే మంచి అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని హితవు పలికారు. ఇప్పటికే ఓటరు కార్డు కలిగిన వారు జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని, చిరునామాలు, నియోజకవర్గాల మార్పులు ఉంటే వాటిని సరి చేయించుకోవాలని, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ పేర్లు ఉంటే తొలగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు తహశీల్ కార్యాలయాలు, మున్సిపాలిటీలను సందర్శించాలని, కలెక్టరేట్‌లోని కాల్ సెంటర్‌కు 08462-224001 నెంబరు ద్వారా సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్ ఏ.ఓ శ్రీ్ధర్ తదితరులు ఉన్నారు.

బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్‌ల
మొదటి విడత పరిశీలన పూర్తి
- కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ
కామారెడ్డి, సెప్టెంబర్ 23: ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్‌ల మొదటి విడత పరిశీలన కార్యక్రమం శనివారంతోనే ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ చెప్పారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ, బ్యాలెట్స్ యూనిట్స్‌కు సంబందింది 1180 యంత్రాలకు గాను, 1171 పని చేస్తున్నాయని, 9 యంత్రాలు పనిచేయడం లేదని వెల్లడించారు. కంట్రోల్ యూనిట్లకు సంబంధించి 930 యంత్రాలకు గాను 911 పనిచేస్తున్నాయని, 19 యంత్రాలు పనిచేయడం లేదని అన్నారు. వివిప్యాట్ యూనిట్లకు సంబంధించి 1000 యంత్రాలకు గాను 909 పని చేస్తున్నాయని, మరో 91 యంత్రాలు పనిచేయడం లేదని అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి వారం రోజుల పాటు ఫస్ట్‌లెవల్ చెకింగ్ కార్యక్రమం ప్రారంభం అయ్యిందని, ఫస్ట్‌లెవల్ చెకింగ్ పూర్తి తరువాత అన్ని యంత్రాలున స్ట్రాంగ్ రూంలో ఉంచి సీలు వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి శివకృష్ణమూర్తి, టీఆర్‌ఎస్ నుండి రవి, బీజేపీ నుండి నీలం చిన్నారాజులు, టీడీపీ నుండి కాశీమల్లిల సమక్షంలో సీలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఉన్నారు.