నిజామాబాద్

హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 24: గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉద్యమ ఉద్ధృతిని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందేనని అన్నారు. నూతన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను అందించలేకపోయిందని ఆక్షేపించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానే్న రాజకీయ నాయకులు అమలు చేయాలని, కానీ, రాష్ట్రంలోని పాలకులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఇక జిల్లా అభివృద్ధి విషయానికి వస్తే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ 20, 21ని ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేకపోయిందని , అలాగే రామడుగు, గుత్ప ఎత్తిపోతల పథకాలు ముందుకు సాగడం లేదన్నారు. సింగూర్ నీరు నిజామాబాద్ జిల్లా రైతుల హక్కు అని, కానీ, సింగూర్ నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లా రైతాంగాన్ని, ప్రజలను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు పట్టాపాస్ పుస్తకాలు అందలేదని, ఇందుకు నిదర్శనం సోమవారం ఇందల్‌వాయిలో రైతులు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడమే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైనందున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అందుకే తాను టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ నియోజకవర్గంలోని ఆయా పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.