నిజామాబాద్

సమాన పనికి సమాన వేతనం మేనిఫెస్టోలో పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, సెప్టెంబర్ 24: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి, సమాన వేతనం ఇస్తామని రాజకీయ పార్టీలో మేనిఫేస్టోలో పెట్టాలని, తదనంతరం అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(ఇఫ్టూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్‌లో మండల స్థాయి గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే పనికి రెండు రకాల వేతనం ఇవ్వడం శ్రమ దోపిడీ, వివక్షత అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నదని అన్నారు. భారత ప్రభుత్వంతో పాటు 29 రాష్ట్రాల ప్రభుత్వాలు సమాన పనికి, సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో 44 కోట్ల మంది కార్మిక వర్గాల్లో 5 కోట్ల మంది కార్మికులకు చట్టాలు అమలు కాగా మిగిలిన 39 కోట్ల మంది కార్మికులకు ఎలాంటి చట్టాలు అమలు కావడం లేదని, పనికి భద్రత లేక ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని ఆయన విమర్శించారు. అందువల్ల కార్మికులు ఐక్యంగా ఉండి పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని, హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు ఇస్సాపల్లి భూమన్న, ఫత్తేపూర్ గంగక్క, సాయమ్మ, నర్సన్న, మంథని రాజన్న, గంగసాయిలు, జ్యోతక్క, పోశన్న తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు కార్మికుల సమస్యలపై పాడిన పాటలు ఉత్తేజపర్చాయి.