నిజామాబాద్

జంప్ జిలానీలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, సెప్టెంబర్ 24: బోధన్ శాసనసభా నియోజకవర్గంలో రాజకీయాలు ములుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలలో కొనసాగుతున్న ముఖ్య నేతలు వలస బాట పట్టనున్నారు. ఇందుకోసం రెండు ప్రధాన పార్టీలలో జోరుగా లాబీయింగ్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తామంతా ఇదే పార్టీలో ఉంటామని నాయకులు బహిరంగంగా చెప్పుకొస్తున్నా రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల నాయకులతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ సమాలోచనలు జరుపుతున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జంప్ అయ్యేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పదవుల ఆశలతో బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఆయా పార్టీల ముఖ్య నాయకులు గతంలో అధికార తెరాస పార్టీలోనికి వలస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో కొందరికి న్యాయం జరుగగా మరికొందరు వలస వెళ్లినా ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలలో నామమాత్రపు కార్యకర్తల వలే పని చేస్తుండటంతో అటువంటి వారు తీవ్ర అసంతృప్తితో కాలం వెళ్లదీస్తున్నారు. తాము ఇలాగే ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రస్తుత పరిస్థితుల్లో వలస బాటలో పయనిస్తే వచ్చే రోజులలోనైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుందేమోనని వారు కలలు గంటున్నారు. గత ఇరవై రోజులుగా బోధన్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిన సంగతి విదితమే. సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ప్రధానంగా ఇతర పార్టీల నుండి భారీ సంఖ్యలో నాయకులను, మాజీ ప్రజాప్రతినిధులను తెరాసలోనికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అనేక మంది ఇతర పార్టీల నాయకులు తెరాసలో చేరారు. కానీ ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు మాత్రం తెరాసలోనికి రాలేక పోయారు. ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు మాజీ కౌన్సిలర్లు మాత్రం తెరాసలో చేరారు. వలసల విషయంలో కొందరు పెద్దలు సైతం రంగంలోనికి దిగి సంప్రదింపులు జరుపుతున్నారు. సంప్రదింపులలో సానుకూలంగా వ్యవహరిస్తున్నా మరికొన్నాళ్లు వేచి చూద్దామని సమాధానం చెబుతున్నట్లు తెలిసింది. అధికార తెరాస మాజీలకు గాలం వేస్తుంటే కాంగ్రెస్ ప్రజల్లో పట్టున్న వారిని తమ పార్టీలోనికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం తెరాసకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో తాము కాంగ్రెస్‌లో చేరుతామని తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిసింది. అయితే వారికి ప్రజలలో అంతగా మంచి పేరు లేకపోవడంతో వారి చేరికల విషయంలో కాంగ్రెస్ పెద్ద మనుషులు సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంఐఎంకు చెందిన మాజీ కౌన్సిలర్లు తెరాస గూటికి చేరగా అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఉన్నత స్థాయిలో లాబీయింగ్ జరుగుతోంది. అలాగే గతంలో కాంగ్రెస్ నుండి తెరాసకు వచ్చిన ఓ సీనియర్ నాయకుడు ఉన్నత పదవి కోసం చేయని లాబీయింగ్ అంటూ లేదు. కానీ ఆయనకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో పదవి రాకపోవడంతో ఆయన తెరాసలో ఇలాగే కొనసాగుతారా లేరా అన్నది అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా బోధన్ సెగ్మెంట్‌లో రెండు ప్రధాన పార్టీల నుండి భారీ వలసలు జరుగబోతున్నాయని తెలుస్తోంది.