నిజామాబాద్

ఆయుష్మాన్ అమలులో టీఆర్‌ఎస్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 25: పేద, బడుగు, బలహీనవర్గాల ఆరోగ్యాలను పరిరక్షించేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేస్తున్న జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి గడ్డం ఆనంద్‌రెడ్డి ఆక్షేపించారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 26న నిజామాబాద్ రూరల్ బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే ఈ పథకం ద్వారా దేశంలో సుమారు 50కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని, అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వారు సద్వినియోగం చేసుకునేలా చూడటంలో కేసీఆర్ ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ప్రత్యక్షంగా 5లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని అన్నారు. అన్ని రకాల వ్యాధుల చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ప్రత్యక్షంగా లబ్ధిని చేకూర్చుతాయని అన్నారు. తెలంగాణలో సైతం సుమారు కోటి మందికి ఈ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే వీటి గురించి ప్రచారం నిర్వహించడం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు ఎనలేని ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి వల్ల ప్రయోజనం లేకుండాపోతోందన్నారు. దీనికి నిరసనగా నేడు చేపట్టనున్న బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు.