నిజామాబాద్

ప్రతీ మండలంలో సామాజిక కల్యాణ మండపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నసరుల్లాబాద్, సెప్టెంబర్ 25: నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో 30 లక్షల రూపాయలతో సామాజిక కల్యాణ మండపం నిర్మిస్తున్నామని, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నసరుల్లాబాద్ మండలంలో మంగళవారం 8 లక్షల రూపాయలతో నిర్మించిన వడ్డెర సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని వడ్డెర సంఘం సభ్యులు రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆత్యధిక మోజార్టీతో గెలిపిస్తామని తీర్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగా సభలో పోచారం మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ది, సంక్షేమం కోసం ఆనేక పథకాలను ఏర్పాటుచేసిందన్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ ప్రజలకు భారీ సబ్సిడీని మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. 50 వేల రూపాయల లోన్‌కు 100 శాతం సబ్సిడీతో, లక్ష రూపాయల లోన్‌కు 80 శాతం సబ్సిడీని అందిస్తున్నామని, ఇట్టి రుణాలతో ప్రజలు వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో 30 లక్షల రూపాయల వ్యయంతో కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నిజాంసాగర్ ఆయాకట్టు కింద ఉన్న పంట పొలాలకు రెండో విడత నీరు అందిస్తున్నామని, మూడు విడతకు రైతులు అధైర్యపడొద్దని, సింగూర్‌నుంచి 1 టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు మళ్లించడానికి సీఎం కేసీ ఆర్ అనుమతి పొందామని తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నేరవేర్చడంలో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేదలకు డబూల్ బెడ్‌రూంలను అందిస్తున్నామని ఆయన అన్నారు. ఆవరణలో గల పిల్లలతో మంత్రి పోచారం కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్యాల మీనహన్మంతు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, జడ్పీటీసీ కిషన్‌నాయక్, టీ ఆర్ ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, లక్ష్మినారాయణ, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు సాయిలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తావాయ్‌సింగ్, రాము, కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.