నిజామాబాద్

నిఘా నేత్రాలుగా సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 25: ప్రజలకు పోలీసులతో పాటు రక్షణ కల్పించడంలో సీసీ కెమారాలు నిఘా నేత్రాలుగా పనిచేయడంతో పాటు నేరాల నిరోధానికి ఇవి షాడో సెక్యురిటీలుగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రజలు విరాళాలతో పెద్ద ఎత్తున కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమారాలు జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమారాలు ఎంతో సత్ఫాలితాలను ఇచ్చాయని అన్నారు. ప్రతి వార్డు, గల్లిలో సీసీ కెమారాలు ఏర్పాటుచేస్తే, దొంగతనాలు, నేరాలు అదుపులో ఉంటాయని అన్నారు. కాలనీ ప్రజలకు సీసీ కెమారాలు ఒక వరం అనే చెప్పవచ్చు అని అన్నారు. తప్పిదారి నేరాలు జరిగిన సీసీ కెమారాల ఆధారంగా నిందితులను పట్టుకోవడంతో సీసీ కెమారాలు ఎంతోగానో పోలీసు శాఖకు తోడ్పాటును అందిస్తాయని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ కెమారాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారందర్ని ఎస్పీ అభినందించారు. సీసీ కెమారాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీసీ కెమారాలు ఉన్నప్పటికీ, పోలీసుల గస్తీ ముమ్మరం చేస్తామని అన్నారు. రాత్రుళ్ల జిల్లాకేంద్రంలో పోలీసు పెట్రోలింగ్ ఉంటుందన్నారు. ఎప్పుడు పోలీసులు అలర్ట్‌గా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల సంపూర్ణ సహకారం ఉంటే నేరరహిత జిల్లాగా కామారెడ్డిని మార్చవచ్చని అన్నారు. సీసీ కెమారాల ఏర్పాటు తరువాత నేరాల సంఖ్య తగ్గుముఖం పడ్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీ్ధర్‌కుమార్‌తో పాటు ఎస్‌ఐలు, పోలీసులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.